పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఆబాది బేగం బానొ

బక్రీద్‌ పర్వదినం సందర్భంగా గోవులను ఖుర్బాని ఇవ్వాల్సిన అవసరం లేదని మౌలానా మజ్రుల్‌ హఖ్‌ వెల్లడించారు. సహాయ నిరాకరణో ద్యమ్మంలో భాగంగా విద్యార్ధులు కళాశాలను వదిలేశారు. ఆ విద్యార్థుల కోసం జాతీయ ముస్లిం విద్యాలయమైన జామియా మిల్లియా ఇస్లామియా 1920 అక్టోబరులో ఆవిర్భవించింది.

ఈ ఉద్యమంలో పురుషులతోపాటుగా ముస్లిం మహిళలు కూడా మాతృదేశం కోసం త్యాగాలు చేయడంలో తామెవ్వరికి తీసిపోమంటూ రంగం మీదకు వచ్చారు. నా దేశంలోని కుక్కలు పిల్లులు కూడా బ్రిటిష్‌ బానిసత్వపు సంకెళ్ళల్లో బంధీలుగా ఉండరాదన్నది నా అభిమతం, అని గర్జించిన ఆబాది బేగం బానొ, సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదనను తిరస్క రించిన గాంధీజిని విమర్శించి, ఆ తరువాత ఆయనచేత కూడా శబాష్‌ అన్పించుకున్న బేగం నిషాతున్నీసా మోహాని, అంజాది బేగం, అక్బరి బేగం, అమీనా తయ్యాబ్ణి, షఫాతున్నీసా బేగం, ఫాతిమా ఇస్మాయిల్‌, బీబీ అముత్సులాం లాంటి మహిళలెందరో ఖిలాఫత్‌ - సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రధాన పాత్రధారులయ్యారు.

ఈ మహిళలలో కొందరు భర్తలను ప్రోత్సహిస్తే మరికొందరు అరెస్టయిన భర్తల స్థానంలో ఉద్యమ భాధ్యతలు నిర్వహించారు. రచనలతో కొందరు, ప్రసంగాలతో మరికొందరు, అస్తిపాస్తులను జాతీయోద్యమ వ్యాప్తికి, ఉద్యమించి శిక్షలకు గురైన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ధారాళంగా వినియోగించిన వారూ ఉన్నారు. అపూర్వమైన త్యాగాలతో ప్రజల గౌరవాభిమానాలు పొందటమే కాకుండా, ఆమె సమక్షాన శ్రద్ధాబావనతో నా శిరస్సు వంచాను, అని గాంధీజీచే గౌరవాభిమానాలు పొందిన బేగం షంషున్నీసా అన్సారిలాంటి మహిళామతల్లులూ ఉన్నారు.

' సంపూర్ణ స్వరాజ్యం ' హసరత్‌ మోహానీ కల

జాతీయోధ్యమంలో చిచ్చర పిడుగు గా ప్రసిద్దుడైన మౌలానా హసరత్‌ మోహాని 1921 నాి అహమ్మదాబాద్‌ కాంగ్రెస్‌ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్యం ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనను ఆయన ఎప్పటినుండో తన పత్రిక URDU-E-

42