పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

ఈ ఉద్యమంలో ప్రధానంగా ఆలీ సోదరులు గా ఖ్యాతిగాంచిన మౌలానా ముహ్మద్‌ అలీ, మౌలానా షౌకత్‌ అలీ, మౌలానా అజాద్‌, ఆయన విప్లవోద్యమ సహచరుడు అక్రం ఖాన్‌, డాక్టర్‌ అన్సారి, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌, రఫీ అహ్మద్‌ కిద్వాయ్‌, హకీం అజ్మల్‌ ఖాన్‌, మజహరుల్‌ హక్‌, ప్రొఫెసర్‌ ముజీబ్‌, తమిళనాడుకు చెందిన అబ్దుల్‌ రహీం, కేరళకు చెందిన ముహమ్మద్‌ మూసా, అబ్దుల్లా హాజీ, హకీం అజ్మల్‌ ఖాన్‌ హైదారాబాద్‌కు చెందిన అక్బర్‌ అలీఖాన్‌, మీర్‌ ముహమ్మద్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ సుభాన్‌, అమీర్‌ అహమ్మద్‌, సయ్యద్‌ ముహమ్మద్‌ అన్సారి, మక్బూల్‌ అలీ, అతావుల్లా షా బుఖారి, హాజీ ఇమ్‌దాదుల్లా హజిర్‌, విజయవాడకు చెందిన గులాం మొహిద్దీన్‌ సాహెబ్‌ తదితరులు ముఖ్య పాత్ర ధారులయ్యారు. ఈ సందర్భంగా హిందూ సోదరులు కొందరు పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ రావటంతో, ఆ అనవసర భయాల ప్రచారాన్ని నిరోధించేందుకు మౌలానా ఆజాద్‌ పూనుకున్నారు. ఈ అనుమానాల నేపధ్యంలో, ప్రపంచంలోని ఏ ముస్లిం దేశమైనా మన దేశాన్ని ఆక్రమించ చూస్తే, ఈ దేశపు చివరికి ముస్లిం వరకు పోరాడుతారు.. ఖలీఫా గాని మరే ఇతర ఆక్రమణ దారుడు గాని మన దేశం వైపు కన్నెతి చూసినా ఆ శక్తు ల నుండి దేశాన్ని రకంచుకోవటం ముస్లింల ప్రదాన కర్త వ్యమని ఇస్లాం ఆదేశిస్తుందని, ఆయన ప్రకటిచారు.

( ‘..the Mussalmans of India will

fight to the least man in resisting any

Musslaman power that may designs upon India... it is the injection of Islam that the Muslims should protect their country from invaders, irrespective of whether the invaders are Muslim or even the army of the Calipha him self...’ - Freedom Movement and Indian Muslims, Santimoy Ray, PPH,డా|| ఎం.ఎ. అన్సారి New Delhi, 1983, Page 50)

41