పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

శాసనోల్లంఘ న ఉద్యమాన్ని పురస్క రించుకుని బ్రిష్‌ ప్రబుత్వం మహాత్మాగాంధీని 1930 మేలో అరెస్టు చేసింది. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజానీకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ సందర్భంగా షోలాపూర్‌కి చెందిన కార్మికులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ కార్మికులపై బ్రిటిష్‌ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. అనేకమందిని అరెస్టు చేసి జైళ్ళల్లో కుక్కింది. నిరసనోద్యమ నేతలపై విచారణ జరిపి ఉరిశిక్షలు విధించింది. ఈ యోధులలో అబ్దుల్‌ రషీద్‌, ఖుర్బాన్‌ హుస్సేన్‌లున్నారు. దాయాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోవల్సిందిగా మిత్రులు ఒత్తిడి తెచ్చినప్పటికి, ఆ ప్రతిపాదనలను తిరస్కరించి ఆ యోదులు ఉరిశిక్షలను స్వీకరించారు.

అష్పాఖుల్లా ఖాన్‌ బలిదానం

ఉద్వేగంగా ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం ఊపు అందుకోక ముందే ముగిసింది. ఈ విరమణ నిర్ణయం పలు విమర్శలకు గురైంది. సంపూర్ణ స్వరాజ్య సాధనకు విప్లవ మార్గం మినహా మరో దారి లేదని భావించిన విప్లవ గ్రూపులు తిరిగి విజృంభించేందుకు ప్రేరణ కల్పించింది. దీనితో అగ్నియుగం మలిదశ ప్రారంభమైంది. సంపూర్ణ స్వరాజ్యాన్నిసాధించేందుకు

ఆయుధం పట్టడం తప్ప మరోమార్గం లేదని

భావించిన అష్పాఖుల్లా ఖాన్‌ లాంటి యువకులు హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ లాంటి విప్లవకారుల సంస్థలలో భాగస్వాములయ్యారు. ఈ సంస్థ ఆద్వర్యంలో జరిగిన కాకోరి జైలు సంఘటనలో ఆయన పాత్రధారి. ఉరిశిక్షలు తప్పని ఈ కేసులలో అసోసియేషన్‌ నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను రక్షించేందుకు, ఆరోపణలను అంగీకరిస్తూ, పూర్తి నేరాన్ని తన నెత్తిన వేసుకుంటూ ఉన్నత న్యాయస్థానానికి ఆష్పాఖుల్లా లేఖ రాశారు. సమాజంలోని అర్థిక, సాంఫిుక అసమానతలన్నీ తొలగిపోయి సమసమాజం ఏర్పడాలని బలంగా కాంక్షించారు. ఈ మేరకు తన అభిప్రాయాలకు ఆయన అక్షర రూపం కల్పించారు. చివరకు ఈ కేసులో ఆయనకు ఉరిశిక్ష విధించారు.

45