భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు
మధ్యనున్న ఐక్యతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్న తీరు ముస్లిం నేతలకు చాలా కష్టం కలిగించాయి. ఈ సమస్యను ప్రముఖ ముస్లిం నాయకుటు ఆగాఖాన్ కాంగ్రెస్ అగ్ర నేతలు శ్రీ ఫిరోజ్ షా మెహతా, శ్రీ గోపాల కృష్ణ గోఖలేల దృష్టికి కూడా తెచ్చారు. ఆ విషయయైు గోఖలే స్పందించినప్పటికి మౌలికంగా తగిన మార్పులు కన్పించలేదు. (Gokhale was ‘ deeply distressed to watch his political friends and associates. deliberately sowing the seeds of permanent disunity between Hindus and Muslims..’ - From THE MEMORIES, by Aga Khan quoted by Shan Mohammad in Muslims and India’s Freedom Movement, IOS, New Delhi, 2002, Page 83)
ముస్లిం జనసముదాయాల ప్రత్యేక సమస్యల పట్ల జాతీయ కాంగ్రెస్ నాయకులు సరిగ్గా స్పందించలకున్నారని ముస్లిం నాయకులు కొందరు భావించారు. ఆ సమయంలో ముస్లిం సముదాయాల సమస్యలు, ఆకాంక్షలకు సంబంధించిన డిమాండ్‌లను ప్రబుత్వం దృష్టికి తీసుకొచ్యేందుకు ఓ సంస్థ అవసరమన్ననిర్ణయానికి వచ్చారు. అ అలోచనతో ఓ సంస్థ ఏర్పాటుకు ప్రముఖ ముస్లిం నాయకులు ముందుకొచ్చారు. ఆ ఫలితంగా 'అల్ ఇండియా ముస్లిం లీగ్' 1906 డిసెంబరు 6న ఉనికిలోకి వచ్చింది. ఈ సంస్థ స్థాపనకు ప్రదానంగా ఆగాఖాన్, నవాబ్ సమీయుల్లా, మోషినుల్ ముల్క్ కారకు లయ్యారు. ఈ సంస్థ తొలి సమావేశంలో దేశంలోని ప్రముఖ ముస్లిం నేతలంతా పాల్గొన్నారు.
ప్రభుత్వంతో పేచీపడకుండా, ఆపార్ధాలను తొలగించి, తమ సమస్యలను విన్నవించుకోవడం. ముస్లింల రాజకీయ హక్కులను కాపాడటం. ఇతర సాంఫిుక జనసముదాయాల పట్ల ఎటువంటి ప్రతికూల భావనలు కలుగకుండా అడ్డుకోవటం ప్రధాన లక్ష్యాలుగా 'లీగ్ ' ప్రకటించుకుంది.
1909 మింటోమార్లి చట్టం ఉనికిలోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ముస్లింలు కౌన్సిల్ ప్రవేశానికి మార్గం కొంత మేరకు సుగమం అయ్యంది. ఈ మార్పును శ్రీ గోఖలే అహ్యానిస్తూ, ఈ మార్పుకు అనుగుణంగా ముస్లింలు తృప్తిపడినట్లయితే జాతీయ స్థాయి వ్యవహారాలలో హిందువులు ముస్లింలకు హృదయపూర్వక సహకారం అందించగలరు. ఈ క్రమం ద్వారా మాత్రమే ఉమ్మడి విశ్వాసం ఏర్పడగలదు, అని ప్రకటించారు. (‘If the Muslims were satisfied with it..they (the Hindus) would 33