పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

give whole - hearted co-operation in the conduct of national affairs. By that process alone could mutual faith be generated..’ - From THE MEMORIES, by Aga Khan quoted by Shan Mohammad in Muslims and India’s Freedom Movement, IOS, New Delhi, 2002, Page. 85)

ఆరంభమైన అల్‌ ఇండియా ముస్లిం లీగ్లో ఆనాటి ప్రముఖ ముస్లిం నాయకు లంతా జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖ పాత్రను నిర్వహిస్తూ కూడా లీగ్ లో ప్రధాన పదవులలో బాధ్యతలు నెరవేర్చారు. ఆ తరువాత 'లీగ్' క్రమానుగతంగా మార్పులకు లోనవుతూ భారతదేశ రాజకీయలలో పెనుమార్పులకు కారణమైంది. ఆదిలో ప్రకటించిన లక్ష్యాలకు భిన్నంగా విభజన-ద్విజాతి సిద్ధాంతం పల్లవిని లీగ్ అందుకోవటంతో జాతీయ భావాలు గల ముస్లిం నాయకులలో పలువురు ఆ తరువాత క్రమ క్రమంగా లీగ్ కు దూరమయ్యారు. 1906లో బెంగాల్‌ను విభజించి ప్రజల తీవ్ర నిరసనను ఎదుర్కొన్న బ్రిటిష్‌ ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితులలో దిగిరాక తప్పలేదు.1911లో కింగ్ జార్జ్‌ స్వయంగా విభజన ఉత్తర్వులను రద్దు చేయాల్సి వచ్చింది.

నిప్పులు కురిపించిన అగ్నియుగం

స్వదేశీ ఉద్యమం ఇచ్చిన స్పూర్తితో బ్రిటిష్‌ దాస్య శృంఖలాలను తెగ్గొట్టాలన్న సంకల్పంతో ప్రాణాలకు తెగించి పోరాడటానికి సిద్ధమైన దేశభక్తులు విప్లవ గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈ గ్రూపులు విదేశాలలో, స్వదేశంలో రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని బ్రిటిష్‌ ప్రభుత్వం మీద పోరాటం ప్రారంభించాయి.

డాక్టర్‌ బర్కతుల్లా

అగ్నియుగంగా పిలువబడిన ఈ కాలంలోనే జుగాంతర్‌ గ్రూపుకు చెందిన 18 సంవత్సరాల

ఖుదీరాంను, బ్రిటిష్‌ అధికారి భార్యను చంపిన నేరంపై అరెస్టు చేశారు. అరెస్టుకు ముందుగా అతనికి ఒక ముస్లిం యువతి ఆశ్రయం కల్పించింది. ఆమె విప్లవయోధుడు మౌల్వీఅబ్దుల్‌ వహీద్‌ సోదరి. 'ఖుదీరాంకి దీది'గా ఆమె చరిత్రలో స్థానం సంపాదించుకుంది. అలాగే మరొక విప్లవ గ్రూపు 'గదర్‌పార్టీ' పేరుతో 1916లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పడింది. ఈ పార్టీలో డాక్టర్‌ బర్కతుల్లా, డాక్టర్‌ మన్సూర్‌,

34