పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నిరాకరణ' అంశాల పట్ల ఆసక్తి కలిగియున్న ఆయన తన భార్య బేగం నిషాతున్నీసా తో కలసి 'స్వదేశీ స్టోర్స్‌' ను కూడాప్రారంభించారు. 1903 ఆరంభించిన ఉర్దూ పత్రిక URDU-E-MOLLA స్వారా స్వదేశీ ఉద్యమానికి ప్రచారం కల్పిస్తూ, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 'ఇది మంచి ఆయుధం' కాగలదన్నారు. ఈ కారణంగా ఆయన ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. ఆయన పత్రికను జప్తు చేసిన ప్రభుత్వం 50 రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానా మొత్తాన్ని కట్టడానికి ఇష్టపడని మౌలానాను అరెస్టు చేయడం మాత్రమే కాకుండా అతి విలువైన ఆయన గ్రంథాలయాన్ని, ప్రెస్‌ను అతి స్వల్ప మొత్తం కోసం అధికారులు జప్తు చేశారు.

ఈ రకంగా బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ముస్లిం కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించింది.ప్రభుత్వం ఎంత దాష్టికంగా వ్యవహరించినా, బెంగాల్‌లో ఆరంభమైన ఈ స్వదేశీ ఉద్యమానికి ప్రత్యే క ప్రాధాన్యతనిస్తూ ముషీర్‌ హుస్సేన్‌ కిద్వాయి, ప్రస్తుత అంధ్రప్రదేశ్‌ రాజధాని హైదారాబాదుకు చెందిన ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం అన్సారి తదితరులు ఎంతో కృషి చేశారు.

జాతీయ విద్యను ప్రోత్సహించేందుకుగాను అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనాయి. ఈ సందర్భంగానే ఉనికిలోకి వచ్చిన 'వందే మాతరం' నినాదం ప్రతి ఒక్కరికీ ఉతేజాన్నిచ్చింది. ఈ స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న నవాబ్‌ అమీర్‌ హుస్సేన్‌, మౌల్వీ హబీబుద్దీన్‌ అహమ్మద్‌, మౌల్వీ ఇస్మాయీల్‌లు బ్రిటిష్‌ ప్రబుత్వం తీవ్ర నిర్బంధాలకు గురయ్యారు.

ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్ స్థాపన

బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న తరుణంలో, భారత దేశం భవిష్యత్తును ప్రభావితం చేయగల పరిణామాలు సంభవించాయి. అఖిల భారత ముస్లిం లీగ్, హిందూ మహాసభలు ఆవిర్భవించాయి.

ఆనాడు ముస్లింలకు చట్టసభలలో ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ముస్లిం ప్రముఖులు ఎంత సమర్ధులైప్పటికి వారికి కౌన్సిల్లో తగినన్ని స్థానాలు లభించటం లేదని ముస్లిం నేతలు భావించారు. ఈ విషయం మీద' లెజిస్లేటివ్ కౌన్సిల్‌ ' లో మార్పులు తీసుకొచ్చేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. జాతీయ కాంగ్రెస్‌లోని కొందరు నాయకుల అతివాదపోకడలు, హిందూ-ముస్లింల 32