పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


జిల్లా దేవ్‌బంద్‌ కేంద్రమ్గా దారుల్‌ ఉలూమ్‌ ఏర్పడింది. ఈ సంస్థను మౌలానా ముహహమ్మద్‌ ఖాసిం స్థాపంచారు. 1847లో షామ్లిలో జరిగిన తిరుగుబాటులో కతిప్టి బ్రిటీష్‌సైనికదళాల మీద విరుచుకుపడ్డ చరిత్ర ఆయనది. పరాయి పాలకులకు వ్యతిరేకంగా పోరాడల్సిన ఆవశ్యకతను ఆయన విద్యార్థులకు, యువతకు వివరించి కార్యోన్ముఖులను గావించారు. ఈ విధాంగా ఒకే నాణేనికి రెండు పార్శ్వాలుగా దేవ్‌బంద్‌, షామ్లి కేంద్రాలు విభిన్న మార్గాలను ఎన్నుకుని బ్రిటీష్‌ప్రభుత్వ వ్యతిరేక పోరుకు ముస్లింలను ప్రోత్సహించాయి. అటు ధార్మిక నేతలు, ఇటు లౌకిక నాయకులు, జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలను ప్రోత్సహించటం ద్వారా విదేశీ పాలకుల మీద యుద్ధభేరిని మ్రోగించమని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు నందుకున్న భారతీయ ముస్లిం జనసమూహాలు జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో పాల్గొంటూ తమదైన పాత్రను నిర్వహించాయి.

బెంగాల్‌ విభజనకు తీవ్ర ప్రతిఘటన

1905లో లార్డ్‌ కర్జన్‌ బెంగాల్‌ను విభజించాడు. హిందూ-ముస్లింల మధ్యగల ఐక్యతకు గండికొట్టడం ఈ విభజన ఉదేశ్యం. బెంగాల్‌ ప్రజలు తిరగబడ్డారు. బెంగాల్‌లో ప్రారంభమైన విభజన వ్యతిరేక ఉద్యమంలో ముస్లిం జనసామాన్యుల నుండి ప్రముఖుల వరకు చురుగ్గా పాల్గొన్నారు. ఈ పోరులో బారిస్టర్‌ అబ్దుల్‌ రషీద్‌, లియాఖత్‌ హుస్సేన్‌, అబ్దుల్‌ హలీం ఘజనవీ, మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌ బహద్దాూర్‌, గులాం ఇమాం, ఇస్మాయీల్‌ చౌదారి, మౌల్వీ లియాఖత్‌ అలీ, మౌల్వీ అబ్దుల్‌ ఖయ్యూం, మున్షీ హిదాయత్‌ బక్ష్‌, మొహమ్మద్‌ అలీ భీంజి, ఎ.హెచ్‌. గజనవి లాంటి నాయకులు ప్రముఖ పాత్ర వహించారు.

ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా కేంద్రంగా నవాబు సమీయుల్లా లాిం ప్రముఖులు విభజనను సమర్థించినా, ఆయన కుటుంబానికి చెందిన నవాబ్‌ అతీఖుల్లా ఖాన్‌ లాంటి ప్రముఖులు ఆయనతో ఏకీబవించక పోగా, సోదరుడు సమీయుల్లా ప్రకటన వ్యక్తిగతం మాత్రమేనని, ఆది కుటుంబ నిర్ణయం కాదని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ పోరాటంలో భాగంగా ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ స్వదేశీ ఉద్యామాన్ని ఓ పవిత్ర కార్యంగా మౌలానా హస్రత్‌ మోహాని స్వీకరించారు. గురువు ప్రభావంతో చిన్ననాటి నుండి 'స్వదేశీ' మరియు 'సహాయ

31