పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

నేతలు తమ పాత్రను నిర్వహించి ఉద్యమానికి ప్రాణం పోశారు. ఆ క్రమంలో మౌలనా ఆజాద్‌ 1923 లో తన 35 ఏండ్ల వయస్సులో అధ్యక్షస్థానాన్ని చేపటటమే కాక 1940లో

మరోసారి కాంగ్రెస్‌ అధ్యక్షపీఠం అలంకరించి, ఏడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉండి చరిత్ర సృష్టించారు.

ఉలెమాల ప్రేరణ

బ్రిటీష్‌ వలస పాలకులు హిందూ-ముస్లింల మధ్యా విభజన తెచ్చి పబ్బం గడుపుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేయసాగారు. అయితే ముస్లింల ధార్మిక మార్గదార్శకులైన ఉలెమాలు ఆ కుయుక్తులను వమ్ముచేస్తూ జాతీయ కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జాతీయోద్యమంలో పాల్గొనటం ముస్లింల విధిగా పేర్కొంటూ విస్రుతంగా ఫత్వాలు జారీ చేశారు.స్వదేశానికి చెందిన వందలాది ఉలెమాలే కాకుండ మదీనా, బాగ్దాద్‌లకు చెందిన ఉలేమాలు కూడ ఇటువిటి ఫత్వాలపైన ఆమోద ముద్ర వేశారు. జాతీయ కాంగ్రెస్‌తో చేతులు కలపొద్దని సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌, అబ్దుల్‌ లతీఫ్‌, సయ్యద్‌ అమీర్‌ ఆలీ లాంటి ప్రముఖులు సలహాలిచ్చినప్పికీ మౌలనా ముహమ్మద్‌ లాంటి వారు ' నమాజ్‌ నాకు ఎంతి విధి అయిందో.....నా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడటం కూడ అంతే తప్పనిసరైన విధిగా ' పేర్కొ న్నారు. ఈ తరహాలో మౌలనా షిబ్లీ నొమాని, మౌలానా రషీద్‌ అహమ్మద్‌, మౌలనా సైపుల్లా, మౌలనా ముహమ్మద్‌ షిరాజీ, మౌలనా ముహమ్మదుల్‌ హసన్‌ తదితర ప్రముఖ ధర్మవేత్తలు బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా జాతీయోద్యమంలో పాల్గొనాల్సిందిగా ముస్లింలను కోరారు. స్వాతంత్య్రోద్యామంలో పాల్గొని బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడల్సిందిగా ప్రజలను కోరుతూ వివిధా ప్రాంతాలకు చెందిన పలువురు ఉలేమాలు ఉమ్మడిగా చేసిన విజ్ఞప్తులను ' శ్రీతిరీజీబిశి-తిజి- జులీజీబిజీ ' పేరుతో ఒక బుక్‌లెట్ కూడా ఆనాడు ప్రచురితమై విస్తారంగా పంపిణీ జరిగింది.

విభిన్న మార్గాలలో బ్రిటీష్‌ వ్యతిరేకత

ఈ మేరకు ప్రజలకు పిలుపు నిచ్చిన ఉలెమాలను బ్రిటీష్‌ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలకు, భారీ మొత్తాలలో జరిమానాలకు,ద్వీపాంతర వాసాలకు గురిచేసి కిరాత కంగా అణిచివేయసాగింది. 1863 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షహరాన్‌పూర్‌

30