పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


లక్ష్యసాధనలో చారిత్రాత్మక పాత్ర నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్‌ ఏర్పడిన తొలిదశలో బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ, రహమతుల్లా సయాని లాంటి ప్రముఖులు కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు. మౌలనా షిబీనోమాని కాంగ్రెస్‌ పక్షాన పూర్తిగా నిలిచారు. మీర్‌ హుమాయూన్‌ కర్మాన్‌ లాంటి సంపన్నులు జాతీయ కాంగ్రెస్‌కు అప్పట్లోనే 5 వేల రూపాయల విరాళం సమర్పించారు. ఆలీ ముహమ్మద్‌ భీంజీ లాంటి ప్రముఖులు దేశమంతా విస్ర్తతంగా పర్యటించి రహిమతుల్లా సయానీ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు అవిశ్రాంత కృషి సల్పారు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో క్రియా శీలక పాత్ర నిర్వహించిన కారణంగా ఆంగ్లేయుల దాష్టికానికి గురౖ పలు ఇక్కట్లుపడు తున్న ముస్లిం జనసముదాయాల సముద్దరణ పాలకులతో పేచీసడితే సాధ్యం కాదని భావించిన మేధావులు సర్‌ సయ్యద్‌ ఆహమ్మద్‌, సయ్యద్‌ అమీర్‌ అలీ లాంటిప్రముఖులు భారత జాతీయ కాంగ్రెస్‌లో ముస్లింల చేరికను వ్యతిరేకిం చారు. ఈ మేరకు తమ అభిప్రాయాలను వ్యకంచేస్తూ జాతీయ కాంగ్రెస్‌ను సమర్థిస్తున్న ప్రముఖుల మీద విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలకు జస్టిస్‌ బద్రుద్దీన్‌ తాయ్యాబ్జి, రహిమతుల్లా యం. సయాని లాంటి వారు తగురీతిన సమధానాలిస్తూ అత్యంత సాహసోపేతంగా ముందుకు ఉపక్రమించారు. ప్రతికూల వాతావరణంలో కూడ ఈ నేతలు బద్రుద్దీన్‌ తయ్యాబ్జి సాగించిన కృషి వలన ఇతర జనసముదాయాలతో పాటుగా ముస్లింలు కూడ జాతీయ కాంగ్రెస్‌ భవిష్యత్తుకు పునాదిరాళ్ళయ్యారు.

ఆ తరు వాత కాలంలో జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జి, రహమతున్లా యం. సయాని, మౌల్వీ మజహరుల్‌ హఖ్‌, డాక్తర్ యం.ఎ. అన్సారి, మøలానా అబుల్‌ కలాం ఆజాద్‌, నవాబ్‌ సయ్యద్‌ బహుదూర్‌, హసన్‌ ఇమాం లాంటి పలువురు ప్రముఖులు అధ్యక్ష స్థానాన్ని చేపట్టారు. జాతీయోద్యమం కీలక దశల గుండా సాగుతున్నప్పుడు సమర్థవంతంగా ఈ

29