పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఈ పోరాటంలో అసంఖ్యాక మహిళలు కూడ పాల్గొన్నారు. ఈ మహిళలకు స్పూర్తిదాయకం

బేగం హజరత్‌ మహాల్‌, ఆంగ్లేయ యువతులే ఆయుధాలు చేపట్టటం ఎరుగని రోజుల్లో మహిళా సైనికాదళాలు ఏర్పాటు చేయటమే కాకుండ, స్వయంగా శిక్షణ గరిపి, నానా సాహెబ్‌ పక్షాన రణరంగంలో వీరవిహారం చేసిన పాతికేళ్ళ పడుచు బేగం అజీజున్‌ ఆదర్శం. ఆకస్మిక దాడులతో బ్రిటీష్‌ సైనిక శిబిరంలో భయోత్పాతం కల్గించింది పచ్చ దుస్తుల అజ్ఞాత వృద్ధురాలు, మాతృదేశ విముక్తి కోసం సాగుతున్న పోరాటంలో సంతోషంగా ఉరిని స్వీకరించిన బేగం హబీబా, బ్రిటీష్‌ సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న బేగం రహిమా, ఝాన్సీ లక్ష్మీబాయికి వెన్నంటి నిలిచి ఆమెతో పాటుగా ఆంగ్లేయ అధికారుల తుపాకి గుళ్ళకు బలైపోయిన ముందార్‌ లాంటి మహిళలు మరికొందరు. తిరుగుబాటు యోధుల కుటుంబం నుండి వచ్చి, అన్నదమ్ములతో కలసి పోరు బాటన నడవటమే కాకుండ, పట్టుబడ్డాక దండు రహస్యం చెప్పడానికి నిరాకరించి ఆగ్నిమంటలకు ఆహుతై పోయిన సాహసి అస్గరీ బేగం లాింటి మహిళలు పురుషులతో ఏమాత్రం తీసిపోకుండ తమదైన భాగస్వామ్యాన్ని అందించి త్యాగచరితలయ్యారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విఫల మయ్యాక కూడ బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా ధర్మయుధం చేయమంటూ ముస్లింలను ప్రేరేపించినమౌలానా ఫజ్‌లే హఖ్‌ను ఈ సందర్బంగా గుర్తు తెచ్చుకోక తప్పదు. ఆ పిలుపుతో ఆగ్రహంచిన పాలకులు ఆయనను బంధించి, క్షమాబిక్ష కోరితే స్వేచ్ఛ ప్రసాదిస్తామన్నా, అంగీకరించకుండ అండమాను జైలుకు ఆనందంగా వెళ్ళి అక్కడే ఆయన అమరుడయ్యారు. ఈ సంగ్రామంలో సుమారు 27 వేల మంది ముస్లిం స్త్రీ, పురుషులను బ్రిటీష్‌ సైన్యాలు పలు ప్రాంతాలలో ఉరితీసాయని, తగుల బెట్టాయని, క్రూరంగా చంపాయని, మరో 30 వేలమందిని ప్రవాసశిక్షలకు గురిచేశాయని చరిత్ర వెల్లడిస్తుంది.

ఈ ప్రథామ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం జనసముదాయాలు ఎంతగా పాల్గొన్నాయంటే, ఆంగ్లేయాధికారి Henry Mead ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, this rebellion, in its present phase, cannot be called a sepoy Mutiny. It did

22