పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వక్రీకరిస్తున్నాయో వివరిస్తూ దాని పర్యవసానాల్ని స్పష్టం చేశాయి. మండల్‌-మందిర్‌ వుద్యమాల పర్యవసానంగా అగ్రకుల, వర్గాల మేధావులు మతవాద శక్తులతో మిలాఖత్‌ అయి బహుజన, మైనార్టీల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అనేక అంశాల్నిపాక్షికంగా, అవాస్తవంగా చిత్రీకరిస్తున్నారు. దానికి జవాబుగా గత రెండు శతాబ్దాలుగా అట్టడుగు, మైనార్టీవర్గాల్లో చెలరేగిన సాంఫిుక, సాంస్కృతిక, రాజకీయ వుద్యమాలు, వాటిలో ఆయా వర్గాల పాత్రను బయటకు తీసి తమ అస్తిత్వాన్ని, గుర్తింపును చాటి చెప్పడానికి బహుజన, మైనార్టీ మేధావులు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే తమ పూర్వీకుల వారసత్వాన్ని, సాంఫిుక, రాజకీయ రంగాల్లో తమ పాత్రను వివరించడానికి చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరాన్ని గుర్తించారు. దాని పర్యవసానంగా ప్రస్తుతం సబ్‌ఆల్ట్రన్‌ చరిత్ర రచనా విధానం ఒక ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకుంది.

ఈ క్రమంలో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారి 'భారత స్వాతంత్య్రోద్యమం : ఆంధ్రాపరదేశ్‌ ముస్లింలు' 19, 20 శతాబ్దాల వలసవాద, సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ముస్లింల పాత్రను కూలంకషంగా పరిశీలించి, వివరణాత్మకంగా విశ్లేషించింది. ఈ పుస్తకం మొట్ట మొదటిసారిగా మైనార్టీవర్గాల చరిత్రకు సంబంధించిన అనేక నూతన అంశాల్ని వెలుగులోకి తెచ్చింది. అందుకే ఈ గ్రంథం ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర రచనా విధానంలో విశిష్టమైందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రదేశ చరిత్రలో యిప్పటివరకు మరుగునపడిన ఆనేక అంశాల్ని, నూతన ఆధారాలతో గ్రంథకర్త వెల్లడించారు. నిజం చెప్పాలంటే, భారతదేశ చరిత్ర రచనలో సంచలనం/భూకంపం సృష్టించిన Subaltern Histography లేవనెత్తిన అనేక అంశాలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. సంప్రదాయ చరిత్రకారులు వున్నత వర్గాలు, మహాపురుషుల జీవిత చరిత్రను,ఘనకార్యాల్ని, వివిధా వుద్యమాల్లో వారి పాత్రను పొగిడి, సామాన్య ప్రజానీకం పాత్రను విస్మరించారు. అందువల్లే History is not just the Biography of Greatmen అని, ప్రజల చరిత్ర History from below/ peoples History రాయాల్సిన ఆవశ్యకతను సబాల్ట్రన్‌ చరిత్రకారులు చెప్పారు. సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారి రచనా విధానం, రచనా పద్దతి, ఆలోచన దానికి అనుగుణంగా వుందని చెప్పవచ్చును.

ఈ గ్రంథంలో 18-20 శతాబ్దాల్లో బ్రిటిష్‌ బానిస బంధనాల నుండి విముక్తి సాగిన పోరాల్లో పాల్గొన్నముస్లిం యోధులు, వారి త్యాగనిరతి గురించి విపులంగా చర్చించడం జరిగింది. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర ముఖ్య ఘట్టాలను వివరిస్తూ 1780 దశకంలో తెలుగు గడ్డలో జరిగిన తొలినాటి సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన