పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆచార్య అడపా సత్యనారాయణ

M.A.(Osm), M.Phil.(JNU), Ph.D.(Heidelberg)

చరిత్ర విభాగం, ఆర్ట్స్‌ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదారాబాద్‌.

పరిచయ వాక్యం ఈమధ్య కాలంలో భారతదేశ చరిత్ర రచనలో నూతన దాృక్పధాలు, పరిశోధనా విధానాలు, పద్ధతులు క్రమంగా చోటుచేసుకుంటున్నాయి. అదే విధంగా యింతవరకు చరిత్రరచన, పరిశోధనల్లో మరుగునపడిన అంశాల్ని వెలికితీసే ప్రయత్నం కూడా జరుగుతుంది. దానికి ముఖ్యకారణం: సమకాలీన సమాజంలో విశాల ప్రాతిపదిక పై బహుజన, బడుగు మైనార్టీ వర్గాల చైతన్య స్థాయి పెరగడం; అస్తిత్వ వుద్యమాలు విస్తరించడం; భారత సమాజ నిర్మాణంలో, వలసపాలన, భూస్వామ్య వ్యతిరేక, జాతీయ వుద్యమాల్లో వివిధ వర్గాలు నిర్వహించిన పాత్రను నిశితంగా పరిశీలించే చారిత్రక ప్రక్రియ మొదలైంది.

అదే క్రమంలో బహుజనులు, మైనార్టీలు తమ చైతన్యస్థాయిని, సంఘటిత శక్తిని పెంపోందించుకునే తరుణంలో తమ గతాన్ని, ప్రత్యేకతను, సంస్కృతిని చాటి చెప్పుకునే బలమైన ప్రయత్నం కూడ జరుగుతుంది. అందుకు ప్రత్యామ్నాయ చరిత్ర, సామాజిక, రాజకీయ పరిశోధన ఒక ముఖ్యమైన సాధనంగా వుపయోగపడుతుంది. పాలక పక్షాలు జరుపుకునే సంబరాలు, స్వర్ణోత్సవాలు వగైరాలలో అణిచివేత, పీడనకు గురైన పై వర్గాల చారిత్రక పాత్రను, విశిష్టతను విస్మరించడం జరిగింది. భారతదేశ విముక్తి పోరాటాల్లో జాతి నిర్మాణంలో, సామాజిక మార్పులో వారి పాత్రను, సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో ఈ వర్గాల పోరాటయోధుల్ని, త్యాగాల్ని గురించిన వివరాల్ని సాంప్రదాయ, అగ్రవర్గాల చరిత్రకారులు తమ రచనల్లో ప్రముఖంగా పొందుపర్చలేదు.

అదేవిధంగా సంకుచిత జాతీయవాద, కమ్యూనల్‌, హిందూత్వ శక్తులు భారతదేశ చరిత్రను, సంస్కృతిని తమ సిద్ధాంతాల్ని, భావజాలాన్నీ వ్యాప్తిచేయడానికి అనుగుణంగా మార్చుకుంటున్నాయి. చరిత్ర రచనా విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న చర్చ, ముఖ్యంగా మతవాద పార్టీలు, సంస్థలు చరిత్రను ఏ విధంగా కాషాయికరిస్తు