స్వరముతో గూడినదిగాను, నేత్రమందు కన్నీరు గలదిగాను, అధికధ్వని గలదిగాను, గొప్పదిగాను, ప్రక్కలు పిసికికొనునదిగాను ఉండునవ్వు అతిహసిత మనఁబడును.
భయానకరసలక్షణం
| విభావై రనుభావైశ్చ సాత్వికై ర్వ్యభిచారిభిః, | 373 |
| రక్షఃపిశాచభల్లూకవ్యాఘ్రవ్యాళాదిదర్శనం, | 374 |
| యుద్ధదస్యునృపద్రోహవికృతోగ్రస్వనా అపి, | 375 |
| ముఖోష్ఠతాలుకంపాస్యశోషౌ పార్శ్వావలోకనం, | 376 |
| ప్రణామః కాందిశీకత్వ మంగుళిత్రాణచర్వణం, | 377 |
| శరణం భష్మ మే యుష్మద్దాసో౽హం రక్ష రక్ష మాం, | 378 |
| సర్వే౽నుభావకా యస్య త్రాసావేగౌ శ్రమో మృతిః, | 379 |
| ఏతే సంచారిణః ప్రోక్తా భరతాగమవేదిభిః, | |
విావానుభావవ్యభిచారిసాత్వికభావములచే సదన్యరస్యత్వమును బొందింపఁబడినదై యుండుభయస్థాయి భయానకరస మౌను. ఈరసమునకు రాక్షసుఁడు, దయ్యము, భల్లూకము, వ్యాఘ్రము, పాము మొదలైనవానిని జూచుట; శూన్యమైన అడవి, ఇల్లు, తోట, శ్మశానము మొదలయినవానియందు ప్రవేశించుట, జగడము, దొంగ, రాజద్రోహము, వికారముగను ఉగ్రముగను ఉండుస్వరము మొదలయినవి ఆలంబన మౌను. దీనికి చెమట ఉద్దీపనము ముఖము