పుట:భరతరసప్రకరణము.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందర్భము లేనిమాటలచేతను, సత్ప్రలాపములచేతను, దూషణములచేతను, పరక్రియల ననుకరించు పలుకులచేతను, చేష్టలచేతను, దాని ననుసరించిన తటస్థోద్దీపనములచేతను, బాగుగ ఉద్దీపితమై పెదవులు ముక్కు చెక్కిళ్లు ముఖము వీనిని కదలించుటచేతను, దంతముల వెలిబుచ్చుటచేతను, సంతోషముచే గలిగిన లెస్సలెస్స అనుపలుకులచేతను, స్తంభప్రళయములను వర్ణించి రోమాంచాదిసాత్వికానుభవములచేతను భావింపఁబడినదై ఔత్సుక్యము, చాపలము, వ్రీడ, హర్షము, స్మృతి, మదము, శ్రమము, మతి, గర్వము, అవబోధము, విస్మయము వీనిచేత పోషింపఁబడినదై ఆహాస్యరసము స్మితాదిభేదములచే నాఱువిధము లౌనని చెప్పఁబడుచున్నది.

స్మితాదీని నిరూపయతి

స్మితమథ హసితం విహసిత ముపహసితం చాపహసితం చ,
అతిహసితం ద్వౌభేదౌ స్తాముత్తమమధ్యమాధమప్రకృతౌ.

స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అవహసితము, అతిహసితము ఈఆఱున్ను ఉత్తమమధ్యమాధమప్రకృతులయందు ఒక్కొకనికి రెండురెండువంతున గలుగును.

స్మితలక్షణం 1

ఈషద్వికసితైర్గండైః కటాక్షస్పష్టసంస్మితైః,
అలక్షితద్విజాళీకం స్మితమిత్యభిధీయతే.

367

కడకంటిచూపులచే వ్యక్తమైననవ్వులతోను కొంచెము వికాసమును బొందిన చెక్కిళ్లతోను గూడి తెలియఁబడని దంఠములు గలదిగా నుండునవ్వు ఉత్తములకు గలుగును. ఇది స్మిత మనఁబడును.

హసితలక్షణం 2

ఉత్ఫుల్లానననేత్రం తు గండైర్వికసితై స్తథా,
కించిల్లక్షితదంతం చ హసితం తద్విధీయతే.

368