ములుకు, వితర్కము చాపలము ఆవేగము హర్షము మొదలయినవ్యభిచారిభావములును గలవు.
హాస్యరసలక్షణం
| విభావై రనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః. | 358 |
| నీతస్సదస్య రస్యత్వం హాసో హాస్య ఇతీరితః, | 359 |
| మల్లయుద్ధాకూతకర్మ నిర్లజ్జత్వాదితద్గుణైః, | 360 |
| వేదశాస్త్రకలావిద్యాదేశభాషాదికస్య చ, | 361 |
| పరక్రియానుకరణవాగాద్యైరపి చేష్టితైః, | 362 |
| ఓష్ఠనాసాకపోలాస్యస్పందనైర్దంతనిర్గమైః | 363 |
| స్తంభ ప్రళయవర్జైశ్చ సాత్వికై రనుభావితః, | 364 |
| మతిగర్వావబోధైశ్చ విస్మయేన చ సమ్మితః, | 365 |
విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే సదస్యాస్వాద్యత్వమును బొందింపఁబడిన హాసస్థాయి హాస్యరస మనఁబడును. ఈరసము వికటకవులు ఉన్మత్తులు మదించినవారు మొదలయినవారలను ఆశ్రయించినదై మల్లయుద్ధము ఆకూతము చేయుట సిగ్గుమానుట మొదలయినవానిగుణములచేతను, మృగపక్షిమనుష్యులస్వరములయొక్క అనుకరణములచేతను, వేదములు శాస్త్రములు కలలు విద్యలు దేశభాషలు మొదలగువాని యనుకరణములచేతను,