పుట:భరతరసప్రకరణము.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉన్మాదము, మదము, మృతి, విషాదము, అమర్షము, ఆలస్యము, అపస్మారము వీనిని వర్జించి తదితరసంచారిభావములు గలుగును. ఈసంభోగశృంగారము సంక్షిప్త మనియు, సంపన్న మనియు ఇరుదెఱఁగు లౌను. యౌవనవంతులైన స్త్రీపురుషులు సాత్వికోదయము సిగ్గు మొదలగువానిచేత సంక్షిప్తములయిన యుపచారములను పొందినది సంక్షిప్త మనఁబడును. ఎడఁబాసియుండి కూడిన వారిసంభోగము సంపన్న మనఁబడును.

వీరరసలక్షణం

విభావై రనుభావైశ్చ సాత్వికై ర్వ్యభిచారిభిః,
నీతస్సదస్యరస్యత్వ ముత్సాహో వీర ఉచ్యతే.

337


యద్యాలంబనతస్తత్త ద్గుణదానాదిదీపితః,
ప్రసన్నముఖరాగాద్యైరనుభావ్యో భవేదయం.

338


ఔత్సుక్యచింతాహర్షాద్యైః పోష్యతే సహకారిభిః,
యుద్ధవీరో దయావీరో దానవీరశ్చ స త్రిథా.

339

విభావానుభావసాత్వికవ్యభిచారిభావములచే సదస్యరస్యత్వమును పొందింపఁబడినదై ఆలంబనగుణదానాదులచే ఉద్దీపితమైన ఉత్సాహస్థాయి వీరరస మౌచున్నది. అది ప్రసన్నమైనముఖకాంతి మొదలయినవానిచే భావింపదగినది. ఔత్సుక్యము, చింత, హర్షము మొదలయినసహకారులచే పోషింపఁబడును. ఆవీరరసము యుద్ధవీర, దయావీర, దానవీరరసములని ముత్తెఱఁగు లౌను.

యుద్ధవీరరసలక్షణం

సహాయాన్వేషణం యుద్ధే సమరోచితపాటవం,
భీతాభయప్రదానాద్యా అనుభావాః ప్రకీర్తితాః.

340


యుద్ధవీరేహర్షగర్వా మర్షాద్యావ్యభిచారిణః,