| అయోగవిప్రలంభోక్తా దశావస్థా యథోచితం. | 330 |
| అన్యేషు విప్రలంభేషు భవేయు రితి కీర్తితాః, | |
దూరములోనుండిన సమీపములోనుండిన జాడ్యముచేఁ గలుగుకోపము శాపవిప్రలంభ మనఁబడును. ఇందు చింత, సంతాపము, నిశ్వాసము, పాండిమము మొదలయిన అనుభావములు గలుగును. అయోగవిప్రలంభమందుఁ జెప్పఁబడిన దశావస్థలు తదితరవిప్రలంభములయందును యథోచితముగఁ గలుగునని చెప్పబడియున్నది.
సంభోగశృంగారలక్షణం
| అనుకూలౌ నిషేవేతే యత్రాన్యోన్యం విలాసినౌ. | 331 |
| దర్శనస్పర్శనాదీని స సంభోగ ఉదాహృతః, | 332 |
| స్తంభాద్యాస్సాత్వికాస్సర్వే చేష్టా లీలాదయో౽పి చ, | 333 |
| జుగుప్సాశమనిర్వేద వ్యాధ్యున్మాదా మదో మృతిః, | 334 |
| ద్వివిధస్స తు సంక్షిప్త స్సంపన్న శ్చేతి కథ్యతే, | 335 |
| ఉపచారాన్నిషేవేతే స సంక్షిప్త ఇతీరితః, | 336 |
పరస్పరానుకూల్యము విలాసము గలవారై నాయికానాయకులు దర్శనస్పర్శనాదులను బొందునది సంభోగశృంగార మనబడును. అందు వికసించినకనుబొమలచేత నందమయినచూపు, లలితము మధురము నైనపలుకు, స్తంభాదిసాత్వికభావములన్నియు లీలాదిచేష్టలు ప్రసన్నమైనముఖకాంతియు మొదలైనవి దీనికి అనుభావములు. జుగుప్స, శమము, నిర్వేదము, వ్యాధి,