యుద్ధవీరరసమందు యుద్ధమున సహాయమును వెతకుట, యుద్ధమున కుచితమైనపటుత్వము, భయపడినవారలకు అభయమిచ్చుట మొదలయిన అనుభావములును, హర్షము, గర్వము, అమర్షము మొదలయిన వ్యభిచారిభావములును గలవు.
దయావీరరసలక్షణం
| స్వార్థప్రాణవ్యయేనాపి ప్రపన్నత్రాణశీలతా. | 341 |
| ఆశ్వాసన్తోక్తయస్థైర్యమిత్యాద్యా విక్రియా మతాః, | 342 |
వీరరసమందు తనఅర్థము ప్రాణము పోఁగొట్టుకొనియైనను తన్ను శరణుచొచ్చినవారలను రక్షించెడిస్వభావము, ఊఱటపలుకులు, స్థిరత్వము ఇవి మొదలయిన యనుభావములును, మతి ధృతి మొదలైన వ్యభిచారిభావములును గలవు.
దానవీరరసలక్షణం
| స్మితపూర్వాభిభాషిత్వం స్మితపూర్వం చ వీక్షణం, | 343 |
| గుణాగుణవిచారాద్యా అనుభావాస్సమీరితాః, | 344 |
దానవీరరసమందు మందస్మితపూర్వకమైనపలుకు, స్మితపూర్వకమయినచూపు, దయ చేసి విశేషముగ ఇచ్చుట, వారిపలుకులను అనుమోదించుట, గుణాగుణవిచారము మొదలైన అనుభావములును, ధృతియు హర్షము ఇవి మొదలైనవ్యభిచారిభావములును గలవు.
కరుణరసలక్షణం
| విభావై రనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః, | 345 |