పుట:భరతరసప్రకరణము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుట, నిమిత్తము లేక నడచుట, లేచుట, శంక మొదలైనవి, విషాదము, మదము, రోషము ఈయనుభావములు గలుగును.

మూర్ఛాలక్షణం. 9-వది

తాపోత్కర్షాత్తదప్రాప్త్యా మూర్ఛాజ్ఞానక్షయో ముహుః.

316


ఇదమిష్టమనిష్టం తదితి వేత్తి న కించన,
నోత్తరం భాషతే ప్రశ్నే నేక్షతే న శృణోతి చ.

317


క్రమేణ మందావుచ్ఛ్వాసనిశ్వాసౌ నష్టచేష్టతా,
స్పర్శానభిజ్ఞ తేత్యాద్యా భవంత్యత్రానుభావకాః.

318

నాయకుఁడు రానందున అధికతాపముచేత జ్ఞానము క్షయించుట మూర్ఛ యనఁబడును. ఇందు ఇష్టమును అనిష్టమును దెలియకుండుట, పిలిచినను పలుకకుండుట, చూపు లేకుండుట, చెవి వినకుండుట, క్రమముగా నుచ్ఛ్వాసనిశ్వాసములు మందము లగుట, చేష్టలు లేక యుండుట, అంటినఁ దెలియకుండుట ఇవి మొదలైన యనుభావములు గలుగును.

మృతిలక్షణం 10-వది

స్మరోత్థా మరణేచ్ఛా చేన్మృతిరిత్యభిధీయతే,
లీలాశుకవినోదాదిన్యాసస్నిగ్ధసఖీకరే.

319


కలకంఠకలాలాపశ్రుతిర్మందానిలాశ్రయః,
జ్యోత్స్నాప్రవేశమాకందమంజరీప్రేక్షణాదయః.

320


ఉద్బంధనాదిసన్నాహస్సాస్రదృష్ట్యాదయస్త్విహ,

మన్మథవ్యాపారముచేఁ గలుగు మరణేచ్ఛ మృతి యనఁబడును. ఇందు విలాసపుచిలుకతోడియాట మొదలయినవానిని సఖులకు ఒప్పగించుట, కోవెలల ముద్దుపలుకులను వినుట, మందమారుతమును ఆశ్రయించుట, వెన్నెలలోనికిఁ బోవుట, మామిడిపూఁగొత్తులను జూచుట, ఉరి మొదలైనవానిని సిద్ధపఱుచుకొనుట, కన్నీటితోడిచూపు మొదలయినవి గలుగును.