Jump to content

పుట:భరతరసప్రకరణము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిశ్వాసముఖశోషాద్యా అనుభావాస్తదుద్భవాః,

ప్రియునిరాకయొక్క విలంబమునఁ గలుగు కామజ్వరము తాప మనఁబడును. ఇందు వైవర్ణ్యము, కన్నీరు, స్వరభంగము, పడకలో పొరలుట, నిట్టూర్పు, ముఖము వాడుట మొదలైనవి గలుగును.

లజ్జాత్యాగలక్షణం 7-వది

లజ్జాత్యాగస్త్రపాహానిరౌత్సుక్యాదిసముద్భవా.

311


ఉల్లంఘనం భవేద్వాచాం గౌరవాగణనం తథా,
విషాదో వ్యగ్రతా దై న్యమిత్యాద్యైరసుభావ్యతే.

312

ఔత్సుక్యము మొదలైనవానిచేత సిగ్గును మానుట లజ్జాత్యాగ మనఁబడును. ఇందు ఆజ్ఞను మీఱుట, గౌరవమును తలఁపకుండుట, విషాదము, వ్యగ్రత, దైన్యము మొదలైనవి గలుగును.

ఉన్మాదలక్షణం 5-వది

సర్వావస్థాసు సర్వత్ర తన్మనస్కతయా సదా,
అతస్మిన్ స్తదితి భ్రాంతిరున్మాదో విరహోద్భవః.

313


తత్ర చేష్టాస్తు విజ్ఞేయా ద్వేషస్స్వేష్టే౽పి వస్తుని,
దీర్ఘ ముహుశ్చ నిశ్వాసో నిర్నిమేషతయా స్థితిః.

314


అనిమిత్తస్మితధ్యానగానమోహాదయో౽పి చ,
అకాండగమనోత్థానశంకాద్యా అపి విక్రియాః.

315


విషాదమదరోషాద్యా అనుభావా ఇహ స్మృతాః,

ఎప్పుడును సర్వావస్థలయందును నాయకునియందు దత్తచిత్తురాలై యుండుటచేత ఒకవస్తువు మఱియొకవస్తువుగా తోఁచుట విరహమువలన గలిగిన ఉన్మాద మనఁబడును. ఇందు తనయిష్టవస్తువునందుఁగూడ ద్వేషము; నిట్టూర్పు, ఱెప్పపాటులేమి, హేతువు లేక నవ్వుట, ధ్యానించుట, పాడుట, మూర్ఛపో