అతి
విరహవిప్రలంభలక్షణం
| కాలక్షేపస్తు సంప్రాప్తేః కార్యాద్వా పారతంత్య్రతః. | 321 |
| ఏకగ్రామష్టయోర్యూనోర్విరహస్సో౽భిధీయతే, | 322 |
ఒకేయూరిలోనుండెడి నాయికానాయకులకు ప్రీతి సిద్ధమైయుండఁగ కార్యవశమువలన గాని పరాధీనతవలన గాని కలియుటకు కాలహరణము కలిగెనా అది విరహవిప్రలంభశృంగార మనఁబడును. ఇందు ఉత్సాహము, చింత, నిట్టూర్పు, వితర్కము మొదలయినవి గలుగును.
మానవిప్రలంభలక్షణం
| ఈక్షణాలింగనాదీనాం నిరోధో మాన ఉచ్యతే, | 323 |
చూచుట ఆలింగనము మొదలైన వ్యాపారములను నిరోధించియుండుట మాన మనఁబడును. ఆమానము ప్రణయమానమనియు, ఈర్ష్యామానమనియు ఇరుదెచెఱఁగు లౌను.
ప్రణయమానలక్షణం. 1-టిది
| తత్ర ప్రణయమానస్స్యాదాజ్ఞాలంఘనతో మిథః, | 324 |
వానిలో నాయికానాయకులకు పరస్పరము ఆజ్ఞాలంఘనముచేఁ గలుగునది ప్రణయమాన మౌను. ఇందు మాటలాడకయుండుట, ముఖము త్రిప్పుకొనియుండుట మొదలైనవి కలుగును.
ఈర్ష్యామానలక్షణం
| ఈర్ష్యామానస్తు యః కోపః ప్రియే జ్ఞాతాన్యసంగమే, | 325 |