ఏస్నేహాతిశయమువలన మనసున దుఃఖము సుఖమువలెనే తోఁచుచున్నదో యది రాగ మనఁబడును. ఆరాగము కుసుంభరాగమనియు, నీలరాగమనియు, మాంజిష్టరాగమనియు ముత్తెఱఁగు లౌను.
కుసుంభరాగలక్షణం
| కుసుంభరాగస్స జ్ఞేయో యశ్చిత్తే రజ్యతే క్షణాత్. | 251 |
| అతిప్రకాశమానో౽పి క్షణాదేవ వినశ్యతి, | |
ఏరాగము మనసున క్షణకాలముననే కలుగునదియును, అధికముగ ప్రకాశించుచున్నదైనను తత్క్షణమే మాఱునదియునో అది కుసుంభరాగ మనఁబడును.
నీలరాగలక్షణం
| నీలరాగస్తు యస్సక్తో నాపై తి న చ దీప్యతే. | 252 |
ఏది మనసున సక్తమై మాఱకుండను, ప్రకాశించకుండను నున్నదో యది నీలరాగ మనఁబడును.
మాంజిష్ట గలక్షణం
| అచిరేణై వ సంసక్తశ్చిరాదపి న నశ్యతి, | 253 |
ఏది చిత్తమందు త్వరగ సంసక్తమై యెన్నటికిని మాఱక ప్రకాశించుచున్నదో యది మాంజిష్టరాగ మనఁబడును.
అనురాగలక్షణం
| రాగ ఏవ స్వసంవేద్యదశాప్రాప్త్యా ప్రకాశితః, | 254 |
| అన్యే ప్రీతిం రతేర్భేదమామనంతి మనీషిణః, | |