ఈ పుట అచ్చుదిద్దబడ్డది
హము ప్రౌఢస్నేహమనియు, మందస్నేహమనియు, మధ్యస్నేహమనియు ముత్తెఱఁగులఁ జెప్పఁబడినది.
ప్రౌఢస్నేహలక్షణం
| ప్రభానాదిభిరజ్ఞాతచిత్తవృత్తౌ ప్రియే జనే. | 247 |
| ఇతరక్లేశకారీ యః స ప్రౌఢస్నేహ ఉచ్యతే, | |
తోఁచుట మొదలయినవానిచేత నెఱుఁగఁబడని చిత్తవృత్తిగలనాయకుని యందు ఇతరక్లేశకారియైన స్నేహము ప్రౌఢస్నేహ మనఁబడును.
మందస్నేహలక్షణం
| ద్వయోరన్యస్య మానాదౌ తదన్యస్య కరోతి యః. | 248 |
| నైవాపేక్షాం న చోపేక్షాం స స్నేహో మంద ఉచ్యతే, | |
నాయికానాయకులలో ఒకరికి కోపము మొదలయినవి కలిగియున్నప్పుడు రెండవవారికి ఉపేక్షాపేక్షలను జేయకయుండునది మందస్నేహ మనఁబడును.
మధ్యస్నేహలక్షణం
| ఇతరానుభవాపేక్షా మీక్షతే యస్స మధ్యమః. | 249 |
ఇతరానుభవాపేక్షను నెదురుచూచుచున్నది మధ్యమస్నేహ మనఁబడును.
రాగలక్షణం
| దుఃఖమప్యధికం చిత్తే సుఖత్వేనైవ రజ్యతే, | 250 |
| కుసుంభనీలమాంజిష్టరాగభేదేన స త్రిథా, | |