వ్యభిచారిభావములు స్వాతంత్ర్యపారతంత్ర్యములవలన ఇరుదెఱఁగు లౌచున్నవి. ఇతరపోషణమును బొందినపుడు పరతంత్రములనియును, అటు లేకున్నపుడు స్వతంత్రములనియును జెప్పఁబడును.
వ్యభిచారిభావానాం దశాచతుష్టయలక్షణం
| ఉత్పత్తసంధిశాబళ్యశాంతయో వ్యభిచారిణాం, | 233 |
| సరూపమసరూపం వా భిన్నకారణకల్పితం, | 234 |
| శబళత్వం హి భావానాం సంమర్దస్స్యాత్పరస్పరం, | 235 |
ఉత్పత్తియని, సంధియని, శాబళ్యమని, శాంతియనియు వ్యభిచారిభావములకు నాలుగవస్థలు గలవు. ఇందు ఉత్పత్తియనునది భావము గలుగుట. సరూపములైనను, అసమానరూపములైనను భిన్నకారణములచేతఁ గల్పితములైన రెండుభావములు చేరెనేని సంధి యనఁబడును. భావములు ఒకదాని నొకటి యొరయుట శబళత్వ మనఁబడును. అత్యారూఢమైన భావముయొక్క లయము శాంతి యనఁబడును.
| అభాసతా భవేదేషామనౌచిత్యప్రవర్తనం, | 236 |
ఈభావములకు అనౌచిత్యప్రవర్తనము ఆభాసత యనఁబడును. ఆయనౌచిత్యము అసత్యానౌచిత్యమనియు, అయోగ్యానౌచిత్యమనియు ఇరుదెఱఁగు లౌను.
అనౌచిత్యద్వితయలక్షణం
| అసత్యత్వకృతం తత్స్యాదచేతనగతం తు యత్, | 237 |