త్రాసలక్షణం
| త్రాసస్స్యాచ్చిత్తచాంచల్యం విద్యుత్క్రవ్యాదగర్జితైః, | 227 |
| ఉత్కంపగాత్రసంకోచ రోమాంచ స్తంభగద్గదాః, | 228 |
మెఱపు, రాక్షసులు, ఉఱుము, పిశాచము, సర్పము మొదలైనవానిచేఁ గలుగు చిత్తచాంచల్యము త్రాస మనఁబడును. ఇందు ఉత్కంపము, దేహసంకోచము, రోమాంచము, స్తంభము, గద్గదము, అడుగడుగునకు ఱెప్పపాట్లు, భ్రమ, ప్రక్కనుండువారిని పట్టుకొనుట మొదలయినవి గలుగును.
వితర్కలక్షణం
| ఊహో వితర్కస్సందేహవిమర్శప్రత్యయాదిభిః, | 229 |
| అత్రానుభావాస్స్యురమీ భ్రూశిరఃకంపనాదయః, | |
సందేహము, నిశ్చయము మొదలయినవానిచేఁ గలుగు ఊహాత్మకమును సత్యాసత్యనిర్ణయము వితర్క మనఁబడును. దీనియందు కనుబొమ లెగురవేయుట, తలయాడించుట మొదలయిన యనుభావములు గలుగును.
| ఉత్తమాధమమధ్యేషు సాత్వికవ్యభిచారిణః. | 230 |
| విభావా అనుభావాశ్చ వర్ణనీయా యథోచితం, | |
ఉత్తమ అధమ మధ్యమ స్వభావముగలవారియందు విభావానుభావసాత్వికభావవ్యభిచారిభావములు యథోచితముగ వర్ణింపఁదగినవి.
| స్వాతంత్ర్యాత్పారతంత్ర్యాచ్ఛ ద్వివిధా వ్యభిచారిణః. | 231 |
| వరపోషకతాం ప్రాప్తాః పరతంత్రా ఇతీరితాః, | 232 |