దాహజ్వరమందు చల్లనిపూలదండ మొదలయినవానిని ధరించుట, చేతులు కాళ్లు ఎత్తెత్తివేయుట, మొగము వాడిపోవుట మొదలయినవి గలుగును.
ఉన్మాదలక్షణం
| ఉన్మాదశ్చిత్తవిభ్రాంతిః వియోగాదిష్టనాశతః. | 217 |
వియోగము, ఇష్టనాశనము వీనివలన గలుగు చిత్తవిభ్రమము ఉన్మాద మనఁబడును.
వియోగజోన్మాదో యథా
| వియోగజే తు చేష్టాస్స్యుర్ధావనం పరిదేవనం, | 218 |
| అచేతనైస్సహాలాపో నిర్నిమిత్తస్మితాదయః, | |
వియోగజోన్మాదమందు పరుగెత్తుట, పరిదేవనము, సంబంధము లేనిపలుకులు పలుకుట, పండుకొనియుండుట, త్వరగా లేచుట, ప్రాణములేనివానితో మాటలాడుట, కారణములేక నవ్వుట, మొదలయినవి గలుగును.
ఇష్టనాశోన్మాదో యథా
| ఇష్టనాశకృతోన్మాదే భస్మాదిపరిలేపనం. | 219 |
| నృత్తగీతాదిరచనా తృణాదేర్మాల్యధారణం, | 220 |
ఇష్టనాశోన్మాదమందు భస్మము మొదలయినవానిని బూసికొనుట, నృత్తము గీతము మొదలయినవి చేయుట, తృణము మొదలయినవానిదండలను ధరించుట, ఇవియును వియోగజోన్మాదమందుఁ జెప్పినక్రియలును గలుగును.
మరణలక్షణం
| వాయోర్ధనంజయస్యాపి విప్రయోగో మహాత్మనః, | 221 |