అనేకశాస్త్రార్థములను జెప్పుటవలనఁ గలుగు అర్ధనిర్ణయయము మతి యనఁబడును. ఇందు యుక్తమగుపనులను జేయుట, సంశయమును బోఁగొట్టుట, శిష్యోపదేశము, కనుబొమల నాడించుట, ఊహాపోహములు మొదలయినవి గలుగును.
వ్యాధిలక్షణం
| దోషోద్రేకవియోగాద్యైః జ్వరాత్మా వ్యాధిరుచ్యతే, | 213 |
| వృథాకృతాంగవిక్షేపో నిశ్వాసాద్యాస్తు విక్రియాః, | 214 |
దోషోద్రేకముచేతను, వియోగాదులచేతను గలుగుజ్వరము వ్యాధి యనఁబడును. ఇందు దేహము స్తంభించుట అంగము బిగి తగ్గుట, అఱచుట, ముఖము వంకరపోవుట, వ్యర్థముగ నంగవిక్షేషముఁ జేయుట, నిట్టూర్పు మొదలయినవి గలుగును. ఆజ్వరము శీతజ్వరమని, దాహజ్వరమనిన్ని ఇరుదెరంగు లౌను.
శీతజ్వరవ్యాధిర్యథా
| శీతజ్వరే తు చేప్టాస్స్యుస్సంతాపశ్చాంగసాదనం, | 215 |
| జానుకంపనరోమాంచముఖశోషాదయో౽పి చ, | |
శీతజ్వరమందు తాపము, దేహము చిక్కుట, చెక్కిళ్లు చలించుట, కన్నీరు, సర్వాంగమును వణకుట, అఱచుట, మోకాళ్లు వణకుట, పులకరింపు, ముఖము వాడుట, మొదలయినవి గలుగును.
దాహజ్వరో యథా
| దాహజ్వరే తు విజ్ఞేయాశ్శీతమాల్యాదిధారణం. | 216 |
| పాణిపాదపరిక్షేపముఖశోషాదయో౽పి చ, | |