| ఏతచ్చ ద్వివిధం ప్రోక్తం వ్యాధిజం చాభిఘాతజం, | |
సర్వాంగవ్యాపిగానుండు ధనంజయవాయువుయొక్క నిర్గమము మరణ మనఁబడును. ఈమరణము వ్యాధిజమని, అభిఘాతజమని, ఇరుదెఱఁగు లౌను.
వ్యాధిజమరణం యథా
| ఆద్యే త్వసాధ్యహృచ్ఛూలా విషూచ్యాదిసముద్భవే. | 222 |
| అనుభావా అమీ ప్రోక్తా అవ్యక్తాక్షరభాషణం, | 223 |
| హిక్కా పరిజనాపేక్షా నిశ్చేష్టే౦ద్రియతాదయః, | |
అసాధ్యమైన హృద్రోగము విషూచి మొదలయినవానిచేతఁ గలుగునది వ్యాధిజమరణ మందు కొతుకుచు మాటలాడుట, దేహకాంతి మాఱిపోవుట, మెల్లఁగా శ్వాసము విడుచుట, మాట నిలిచిపోవుట, నేత్రమీలనము, హిక్క, పరిజనముల నపేక్షించుట, ఇంద్రియచేష్ట లణఁగుట, మొదలయినవి గలుగును.
అభిఘాతమరణం యథా
| ద్వితీయం ఘాతపతనదేహోద్బంధవిషాదిజం. | 224 |
| తత్ర ఘాతభవే భూమిపతనక్రందనాదయః, | 225 |
| కార్శ్యం కంపో దాహో హిక్కా ఫేనశ్చ కంధరాభంగః, | 226 |
ఘాతము, పడుట, దేహబంధనము, విషము, వీనిచేఁ గలుగునది యభిమాతజమరణము. అందు ఘాతజమందు నేలఁబడుట, ఏడ్చుట, మొదలయినవి. వసనాభి మొదలయినది విషము. పతనాదులయిన యభిఘాతమువలనఁ గలుగు చేష్టలు - చిక్కిపోవుట, వణఁకుట, తాపము, హిక్క, ఘనము, కంధరాభంగము, జడత, మరణము మొదలయినవి.