| విషాద ఇతి విఖ్యాతో భరతార్ణవపారగైః, | 194 |
తానారంభించినపని సాగకుండుట, ఇష్టపదార్థాప్రాప్తి, విపత్తు, తప్పు వీనివలనఁ గలుగు ననుతాపము విషాద మనఁబడును. ఆవిషాదము ఉత్తమ, మధ్యమ, అధమముల యాశ్రయమువలన మూఁడుతెఱఁగులు గలది యగును.
జ్యేష్ఠవిషాదో యథా
| సహాయాన్వేషణోపాయచింతాద్యా ఉత్తమే స్మృతాః, | |
ఉత్తమునివిషాదమందు సహాయమును వెతుకుట, ఉపాయచింత మొదలైనవ్యాపారములు గలుగును.
మధ్యమవిషాదో యథా
| అనుత్సాహశ్చ వైచింత్యం వైక్లబ్య మవిలోకనం. | 195 |
| విషాదే మధ్యమే ప్రోక్తా భ్రాంత్యాద్యాశ్చైవ విక్రియాః, | |
మధ్యమునివిషాదమందు ఉత్సాహము లేకయుండుట, మిక్కిలి చింతించుట, కార్యాకార్యములు తెలియక యుండుట, ఎవరిని తలయెత్తి చూడకుండుట, భ్రమించుట మొదలయిన క్రియలు గలుగును.
అధమవిషాదో యథా
| రోదనశ్వసితధ్యానముఖకోణాదయో౽ధమే. | |
అధమునివిషాదమందు రోదనము, నిట్టూర్పు, ధ్యానము, ముఖము వంకర మొదలైనవి గలుగును.
ఔత్సుక్యలక్షణం
| కాలాక్షమత్వమౌత్సుక్యం అభిలాషాదిహేతుజం, | 197 |