జడతాలక్షణం
| జాడ్యమప్రతిపత్తిస్స్యాదిష్టానిష్టార్థయోశ్శ్రుతేః. | 188 |
| వృష్టేర్వా విరహాదిభ్యః క్రియాస్తత్రానిమేషతా, | 189 |
ఇష్టార్ధము అనిష్టారము వీనివినికివలనఁ గాని, వర్షమువలనఁగాని, విరహము మొదలైనవానివలన గాని కలుగు అజ్ఞానము జాడ్య మాను. ఇందు ఱెప్పపాటు లేకయుండుట, చెవులు వినకయుండుట, పరవశుఁ డౌట, ఊరకయుండుట మొదలగు చేష్టలు గలుగును.
గర్వలక్షణం
| ఐశ్వర్యరూపతారుణ్యకులవిద్యాబలైరపి, | 190 |
| అనుభావా భవంత్యత్ర గుర్వాద్యాజ్ఞావ్యతిక్రమః, | 191 |
| విభ్రమాపహ్నుతీవాక్యపారుష్యమనవేక్షణం, | 192 |
ఐశ్వర్యము, రూపము, యౌవనము, కులము, విద్య, బలము, ఇష్టలాభము మొదలైనవానిచేత నొరుల నవమానించుట గర్వ మనఁబడును. ఇందు అహంభావము, ఆజ్ఞోల్లంఘనము, అనుగ్రహప్రదానము, మోము త్రిప్పుకొనుట, మాటలాడకయుండుట, మొదలైనవియు, పరుషముగ మాటలాడుట, చూడకయుండుట, తనయవయవములను జూచుకొనుట, ఒడలు విఱుచుకొనుట మొదలైనయనుభావములు గలుగును.
విషాదలక్షణం
| ప్రారబ్ధకార్యానిర్వాహాదిష్టాప్రాస్తేర్విపత్తితః, | 193 |