పుట:భరతరసప్రకరణము.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కార్శ్యాధోముఖ్యసంతాపనిశ్వాసోచ్ఛ్వసనాదయః,

ప్రియవస్తువులు లభించనందువలన నైశ్వర్యభ్రంశనము మొదలయినవానిచేతఁ గలుగుధ్యానము చింత యనఁబడును. ఇందు మేను చిక్కుట, తలవంపు, సంతాపము, నిట్టూర్పు మొదలయినవి గలుగును.

మోహలక్షణం

ఆపద్భీతివియోగాద్యైర్మోహశ్చిత్తస్య మూఢతా,
విక్రియాస్తత్ర విజ్ఞేయా ఇంద్రియాణాం చ శూన్యతా.

167


నిశ్చేష్టతాంగభ్రమణపతనాఘూర్ణనాదయః,

ఆపత్తు, భయము, వియోగము మొదలైనవానిచే మనస్సున కేమియుఁ దెలియకపోవుట మోహ మనఁబడును. ఇందు ఇంద్రియములు శూన్యముగ నుండుట, చేష్టలు లేకయుండుట, దేహము తిరుగుట, గ్రుడ్లు గిరగిరలాడుట ఇవి మొదలైనవి క్రియలు గలుగును.

ధృతిలక్షణం

జ్ఞానవిజ్ఞానగుర్వాది భక్తేర్నానార్థసిద్ధితః.

168


లజ్జాదిభిశ్చ చిత్తస్య నైస్సృహ్యం ధృతిరుచ్యతే,
అత్రానుభావా విజ్ఞేయా ప్రాప్తార్థానుభవస్తథా.

169


అప్రాప్తాతీతనష్టార్థానభిసంక్షోభణాదయః,

మోక్షవిషయకజ్ఞానము, శాస్త్రజ్ఞానము, గురుభక్తి, నానావిషయములసిద్ధి, సిగ్గు మొదలైనవానిచేత మనస్సునకు ఇచ్ఛ లేకయుండుట ధృత యనఁబడును. ఇందు లభించినదానిని అనుభవించుట; పొందఁబడనివిషయములు, కడచిన విషయములు, నష్టవిషయములు వీనికిగా మనస్సున చింతలేక యండుట, మొదలయినవి గలుగును.