| జృంభణం మందయానత్వం ముఖనేత్రవికూణనమ్, | 162 |
త్రోవనడచుట, నృత్తమాడుట, క్రీడ మొదలయిన వ్యాపారములచే గలుగు మానసభేదము శ్రమ మనఁబడును. ఇందు అంగమర్దనము, నిట్టూర్పు, కాళ్లు పిసుకుట, ఆవలింత, మందముగ నడచుట, ముఖమును కన్నులను వంకర చేసికొనుట, సత్కారము చేయుట ఈ అనుభావములు గలుగును.
ఆలస్యలక్షణం
| స్వభావభయసౌహిత్యగర్వనిర్భయతాదిభిః, | 163 |
| అంగభంగక్రియాద్వేషజృంభణాక్షివిమర్దనాః, | 164 |
స్వభావము, భయము, తృప్తి, గర్వము, భయములేకయుండుట మొదలగువానిచేత కష్టమున పనులను జేయ యత్నించుట, ఆలస్య మనఁబడును. ఇందు అంగభంగము, క్రియాద్వేషము, ఆవలింత, నేత్రములు నలుపుట, పండుకొనుటయందును కూర్చుండుటయందును ముఖ్యముగా ప్రియము గలుగుట, కన్నులు మూతలుపడుట, నిదుర మొదలయిన క్రియలు గలుగును.
దైన్యలక్షణం
| హృత్తాపదుర్గతత్వాద్యైరనౌధ్ధత్యం హి దీనతా, | 165 |
మనస్తాపము, పేదఱికము మొదలయినవానిచేఁ గలుగు అణఁకువ దైన్య మనఁబడును. ఇందుకు మాలిన్యదేహస్తంభాద్యనుభావములు గలుగును.
చింతాలక్షణం
| ఇష్టవస్త్వపరిప్రాప్తేరైశ్వర్యభ్రంశనాదిభిః, | 166 |