స్మృతిలక్షణం
| స్వతశ్చిత్తదృఢాభ్యాసాత్ సదృశాలోకనాదిభిః. | 170 |
| స్మృతిః పూర్వానుభూతార్థప్రతీతిస్తత్ర విక్రియాః, | 171 |
మనోభ్యాసబలముచేత తనంతటను సమానవస్తువుల చూచుట మొదలైనవానిచేఁ గలుగు పూర్వానుభూతార్థజ్ఞానము స్మృతి యనఁబడును. ఇందు శిరస్సును ఆడించుట, ఊచుట, కనుబొమలవిశేషాపములు మొదలైనవి గలుగును.
వ్రీడాలక్షణం
| అకార్యకరణావజ్ఞాస్తుతినూతనసంగమైః, | 172 |
| తత్ర చేష్టా నిగూఢోక్తిరాధోముఖ్యవిచింతనే, | 173 |
| నఖానాం కృంతనం భూమిలేఖనం చైవమాదయః, | |
అకార్యముఁ జేయుట, అవమానము, స్తోత్రము, నూతనసంగమము, ప్రతికారక్రియ మొదలైనవానిచేత అతిధార్ష్ట్యములేకయుండుట వ్రీడ యనఁబడును. ఇందు మఱుఁగుగ మాటాడుట, తలవంచుట, యోచించుట, బయట రాకుండుట, దూరముగానే ముసుగిడుట, గోళ్లు గిల్లుట, నేలగీరుట ఇవి మొదలైనవి గలుగును.
చపలతాలక్షణం
| రాగద్వేషాదిభిశ్చిత్తే లాఘవం చాపలం భవేత్. | 174 |
| చేష్టాస్తత్రావిచారేణ పరిరంభావలోకనే, | 175 |