పుట:భరతరసప్రకరణము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవి స్థాయులను బాగుగ చరింపఁజేయుచున్నవిగనుక సంచారులనియును జెప్పఁబడును.

ఉన్మజ్జంతో నిమజ్జంతః స్థాయిన్యంబునిథావివ.

142


ఊర్మివద్వర్ధయంత్యేనం యాంతి తద్రూపతాం చ తే,

ఏభావములు స్థాయియందు సముద్రమందుండునలలవలె దానిని వృద్ధి బొందించి తద్రూపతను పొందుచున్నవో అవి వ్యభిచారిభావము లనఁబడును.

నిర్వేదాదయో నిరూప్యంతే.

నిర్వేదగ్లానిశంకాశ్చ తథాసూయామదశ్శ్రమః.

143


ఆలస్యం చైవ దైన్యం చ చింతా మోహో ధృతిః స్మృతిః,
వ్రీడా చపలతా హర్ష ఆవేగో జడతా తథా.

144


గర్వో విషాద ఔత్సుక్యం నిద్రాపస్మార ఏవ చ,
సుప్తిర్విబోధో౽మర్షశ్చ అవహిత్థాప్యథోగ్రతా.

145


మతిర్వ్యాధి స్తథోన్మాదః తథా మరణమేవ చ,
త్రాసశ్చైవ వితర్కశ్చ విజ్ఞేయా వ్యభిచారిణః.

146


త్రయస్త్రింశదమీ భావాః సమాఖ్యాతాస్తు నామతః,

నిర్వేదము, గ్లాని, శంక, అసూయ, మదము, శ్రమము, ఆలస్యము, దైన్యము, చింత, మోహము, ధృతి, స్మృతి, వ్రీడ, చపలత, హర్షము, ఆవేగము, జడత, గర్వము, విషాదము, ఔత్సుక్యము, నిద్ర, అపస్మారము, సుప్తి, విబోధము, అమర్షము, అవహిత్థ, ఉగ్రత, మతి, వ్యాధి, ఉన్మాదము, మరణము, త్రాసము, వితర్కము ఈ ముప్పదిమూఁడును వ్యభిచారిభావములని చెప్పఁబడును.