ప్రళయలక్షణం
| ప్రళయస్సుఖదుఃఖాద్యై శ్చేతసస్తు విసంజ్ఞతా. | 137 |
ప్రళయమనఁగా సుఖదుఃఖాదులచేఁ గలుగు ప్రజ్ఞాభంగము.
| ఏతేషాం సత్వమూలత్వాత్ భావానాం సాత్వికప్రథా, | 138 |
| ఏవం ద్వైవిధ్యమేతేషాం దర్శితం భావకోవిదైః, | |
సత్వమూలములైనవిగనుక వీనికి సాత్వికభావములని పేరు. భావసంసూచనాదులు అనుభావము లనఁబడును. ఇట్లు అనుభావములు రెండువిధములు గలిగియుండును.
| విభావా అనుభావాశ్చ తే భవంతి పరస్పరం. | 139 |
| కార్యకారణభావాశ్చ జ్ఞేయా భావవిశారదైః, | |
విభావానుభావములు ఒకటికొకటి కార్యకారణభావములుగాను భావజ్ఞులచే నెఱుఁగఁదగినవి.
ఇత్యనుభావాస్సమాప్తాః
అథ వ్యభిచారిభావా నిరూప్యంతే
| వ్యభీ ఇత్యుపసర్గౌ ద్వౌ విశేషాభిముఖత్వయోః. | 140 |
| విశేషేణాభిముఖ్యేన చరంతి స్థాయినం ప్రతి, | 141 |
పలుకు, దేహము, సత్వము, వీనితోఁ గూడినవై స్థాయికి విశేషాభిముఖములుగాఁ దిరుగుభావములు వ్యభిచారిభావములని యెఱుఁగవలయును.
| విచారయంతి వా సమ్యగితి సంచారిణో౽పి తే, | |