మనఁబడును. అందునుండి గలుగుభావములు సాత్వికము లౌను. అవి స్తంభమనియు, స్వేదమనియు, రోమాంచమనియు, స్వరభేదమనియు, వేపథువనియు, వైవర్ణ్యమనియు, అశ్రువనియు, ప్రళయమనియు నీయెనిమిది సాత్వికభావము లనఁబడును.
స్తంభలక్షణం
| స్తంభో హర్షభయామర్ష విషాదాద్భుతసంభవః. | 130 |
| అనుభావో భవేదత్ర నిష్క్రియాంగత్వమేవ హి, | |
స్తంభ మనుసాత్వికభావము సంతోషము, భయము, కోషము, విషాదము, అద్భుతము, వీనిచేఁ గలుగు నిష్క్రియాంగత్వము.
స్వేదలక్షణం
| నిదాఘహర్షవ్యాయామశ్రమక్రోధభయాదిభిః. | 131 |
| స్వేదస్సంజాయతే తత్ర త్వనుభావా భవంత్యమీ, | 132 |
ఎండ, సంతోషము, వ్యాయామము, శ్రమము, క్రోధము, భయము, మొదలైనవానిచేత స్వేదము (అనఁగా చెమట) కలుగును. అప్పుడు చెమటను తుడుచుకొనుట, గాలిని ఇచ్ఛయించుట, వ్యజనగ్రహణము మొదలైనఅనుభావములు గలుగును.
రోమాంచలక్షణం
| రోమాంచో విస్మయోత్సాహహర్షాద్యైస్తత్ర విక్రియాః, | 133 |
ఆశ్చర్యము, ఉత్సాహము, సంతోషము, మొదలైనవానిచేత రోమాంచము కలుగును. అందు గగుర్పొడుచుట మొదలయినవికారములు కలుగును.