అర్థాంతరమును దెలియపఱుచుపలుకు అపదేశ మనఁబడును.
ఉపదేశలక్షణం
| యచ్ఛిష్యార్థం తు వచన ముపదేశస్స ఉచ్యతే. | 125 |
శిష్యులకొఱకు ఆచార్యులచేఁ జెప్పఁబడుపలుకు ఉపదేశ మనఁబడును.
వ్యపదేశలక్షణం
| వ్యాజేనాతాభిలాషోక్తిర్యా సా స్యాద్వ్యపదేశకః, | |
ఇతరవ్యాజమున తనకోరికను దెలుపుట వ్యపదేశ మనఁబడును.
అథ బుద్ధ్యారంభానుభావా నిరూప్యంతే
| బుద్ధ్యారంభా స్తథా ప్రోక్తారీతివృత్తిప్రవృత్తయః. | 126 |
ఈబుద్ధ్యారంభానుభావములు రీతియనియు, వృత్తియనియు, ప్రవృత్తియనియు ముత్తెఱంగు లగును.
| ప్రబంధాదిషు తే జ్ఞేయా భావశాస్త్ర విచక్షణైః, | |
ఇవి ప్రబంధము మొదలైనవానియందు భావశాస్త్రజ్ఞులచే నెఱుఁగఁదగినవి.
అథ సాత్వికభావా నిరూప్యంతే
| అన్యేషాం సుఖదుఃఖాదిభావేషు కృతభావనం. | 127 |
| ఆనుకూల్యేన యచ్చిత్తం భావకానాం ప్రవర్తతే, | 128 |
| సాత్వికా ఇతి జానంతి భరతాద్యా మహర్షయః, | 129 |
| వైవర్ణ్య మశ్రుప్రళయ ఇత్యష్టౌ సాత్వికా మతాః, | |
ఇతరులయొక్క సుఖదుఃఖములు మొదలైన భావములయందు అనుకూల్యముతో కృతభావనమై యేమనసు ప్రవర్తించుచున్నదో యది సత్వ