స్వరభేదలక్షణం
| స్వరభేదస్సుఖాద్యైస్తు తత్ర స్యుర్గద్గదాదయః, | |
సుఖాదులచే స్వరభేదము గలుగును. ఇందు డగ్గుత్తిక మొదలైనవి గలుగును.
వేపథులక్షణం
| వేపథు ర్హర్షసంత్రాసజ్వరక్రోధాదిభిర్భవేత్. | 134 |
| అత్రాసుభావాః స్మరణగాత్రకంపాదయో మతాః, | |
సంతోషము, బెదరించుట, జ్వరము, కోపము, మొదలైనవానిచే వేపథువు గలుగును. ఇందు స్మరించుట, దేహము వణకుట, మొదలైనవి గలుగును.
వైవర్ణ్యలక్షణం
| విషాదపరరోషాద్యై ర్వైవర్ణ్య ముపజాయతే. | 135 |
| ముఖవర్ణపరావృత్తిః కార్శ్యాద్యాస్తత్ర విక్రియాః, | |
విషాదము, ఇతరులయందుఁ గలరోషము, మొదలైనవానిచే వైవర్ణ్యము గలుగును. ఇందు ముఖతేజస్సు మాఱుట, చిక్కిపోవుట, మొదలైనవి గలుగును.
అశ్రులక్షణం
| విషాదరోషసంతోషధూమాద్యై రశ్రువిక్రియాః. | 136 |
| బాష్పబిందుపరిక్షేపనేత్రసమ్మార్జనాదయః, | |
వ్యసనము, కోపము, సంతోషము, ధూమము, మొదలైనవానిచే అశ్రువు గలుగును. ఇందు కన్నీరు విదిలించుట, కన్నులను తుడుచుకొనుట మొదలయినవి కలుగును.