రూపలక్షణం
| అంగాన్యభూషితాన్యేవ ప్రక్షేపార్హైర్విభూషణైః, | 91 |
అంగములు తగినభూషణములచే అలంకరింపఁబడకయే అలంకరింపఁబడినట్లు దేనిచేత శోభించునో యది రూప మనఁబడును.
లావణ్యలక్షణం
| ముక్తాఫలేషు ఛాయాయాస్తరళత్వమివాంతరే, | 92 |
ముత్యములయం దుండు ఛాయయొక్క తరళత్వమువలెనే అవయవములయందు ఏకాంతి ప్రకాశించుచున్నదో యది లావణ్యమని చెప్పఁబడును.
సౌందర్యలక్షణం
| అంగప్రత్యంగకానాం యో సన్నివేశో యథోచితం, | 93 |
అంగప్రత్యంగములయొక్క చక్కనిసంధిబంధముగల యథోచితసన్నివేశము సౌందర్య మనఁబడును.
ఆభిరూప్యలక్షణం
| యదాత్మీయగుణోత్కర్షైర్వస్త్వన్యన్నికటస్థితం, | 94 |
ఆత్మీయగుణాధిక్యమువలన తనసమీపముననుండు వస్తువునకు తనసారూప్యమును గలుగఁజేయునది యాభిరూప్య మనఁబడును.
మార్దవలక్షణం
| స్పృష్టం యత్రాంగమస్పృష్టమివ స్యాన్మార్దవం హి తత్, | |