ఈ పుట అచ్చుదిద్దబడ్డది
దేహము అంటఁబడియు అంటఁబడనిదానివలెనుండునది మార్దవ మనఁబడును.
సౌకుమార్యలక్షణం
| యా స్పర్శాసహతాంగేషు కోమలస్యాపి వస్తునః. | 95 |
| తత్సౌకుమార్యం త్రేధా స్యాదుత్తమాదిప్రభేదతః, | |
అంగములయందు కోమలమైన వస్తువుయొక్క యైనను స్పర్శమును సహింపమి సౌకుమార్యము. ఆసౌకుమార్యము ఉత్తమ-మధ్యమ-అధమభేదములవలన ముత్తెఱఁగు లౌను.
ఉత్తమసౌకుమార్యలక్షణం
| అంగం పుష్పాదిసంస్పర్శాసహం యేన తదుత్తమం. | 96 |
ఏగుణముచేత అంగము పుష్పాదులస్పర్శమునుగూడ నోర్వదో యది ఉత్తమసౌకుమార్యము.
మధ్యమసౌకుమార్యలక్షణం
| న సహేత కరస్పర్శం యేనాంగం మధ్యమం హి తత్, | |
ఏగుణముచేత అంగము కరస్పర్శమును సహింపదో యది మధ్యమసౌకుమార్యము.
అధమసౌకుమార్యలక్షణము
| యేనాంగమాతపాదీనామసహం తదిహాధమం. | 97 |
ఏగుణముచేత దేహము ఎండ మొదలయినవానిని సహింపదో యది అధమసౌకుమార్యము.
చేష్టాయథా
| చేష్టాస్తు యావనోద్భూతకటాక్షాదయ ఈరితాః, | |