నపుమాటలచే తృప్తిపడనిదిగాను, చవతులయందు అసూయగలదిగాను, అపరాధములను ఓర్వనిదిగాను, ప్రణయకలహమందు ఈర్ష్యకలదిగాను, రతికేళులయందు స్తిమితగాక ఏకాంతమందు గర్వించి వ్యాపరించునదిగాను నుండును.
తృతీయయౌవనలక్షణం
| అస్నిగ్ధతా నయనయోర్గండయోర్మానకాంతితా, | 87 |
| అధరే మసృణో రాగః తృతీయే యౌవనే భవేత్, | 88 |
| వల్లభస్యాపరిత్యాగః తదాకర్షణకౌశలం, | 89 |
నేత్రములయందు తేటమాఱినదియు, చెక్కిళ్ల యందు వాడినదియు, దేహచ్ఛాయ తప్పినదిగాను, కఠినమైనస్పర్శము గలదిగాను, కొంచెము దేహపటుత్వము తప్పినదిగాను, పెదవులయెఱుపు మీఱినదిగాను ఉండునది తృతీయయౌవన మనఁబడును. ఈయౌవనముగల నాయిక వ్యాపారములు, రతితంత్రములయందు విశేషచాతుర్యము, నాయకుని విడువకయుండుట, నాయకుని స్వాధీనపఱుచుకొను పాండిత్యము, నాయకాపరాధములయందు అసూయ లేకయుండుట, సవతులయందు మాత్సర్యము లేకయుండుట మొదలయినవి.
| తత్ర శృంగారయోగ్యత్వం రసాహ్లాదనకారణం, | 90 |
ఈమూఁడువిధముల యౌవనములయందును మొదటిరెండు యౌవనములకే రసములచే సంతోషపఱుచుటకు కారణమైన శృంగారయోగ్యత కలదు. మూఁడవయౌవనమునకు ఈయోగ్యత లేదు.