శఠనాయకలక్షణం
| ప్రియాయామనురక్తాయాం గూఢవిప్రియకర్మకృత్, | 72 |
అనురాగముగల ప్రియకు గూఢముగ అహితముఁ జేయువాఁడు శఠుఁ డనఁబడును.
ఏతేషాం సహాయా నిరూప్యంతే
| పీఠమర్దో విటశ్చేటః విదూషక ఇతి స్మృతాః, | 73 |
ముందు చెప్పినశృంగారనాయకులకు సహాయులగువారు పీఠమర్దుఁ డనియు, విటుఁ డనియు, చేటుఁ డనియు, విదూషకుఁ డనియు నలుదెఱంగు లగుదురు.
పీఠమర్దాదిలక్షణం
| కించిదూనః పీఠమర్దః ఏకవిద్యో విటః స్మృతః, | 74 |
నాయకునికి కొంచెము తక్కువగా నుండువాఁడు పీఠమర్దుఁడు. కామశాస్త్రప్రవీణుఁడైయుండువాఁడు విటుఁడు. నాయికానాయకులకు సంధిచేయువాడు చేటుఁడు. హాస్యప్రధానుఁడై యుండువాఁడు విదూషకుఁడు.
అథ ఉద్దీపనవిభావో నిరూప్యతే
| ఉద్దీపనశ్చతుర్ధా స్యాదాలంబనసమాశ్రితః, | 75 |
ఆలంబనవిభావము నాశ్రయించియుండు గుణములు చేష్టలు అలంకృతులు ఇవి మూఁడును, తటస్థములును కూడ ఉద్దీపనవిభావము నలుదెఱఁగులఁ బరగును.