ఆలంబనగుణా యథా
| యౌవనం రూపలావణ్య సౌందర్యాణ్యభిరూపతా, | 76 |
యౌవనము, రూపము, లావణ్యము, సౌందర్యము, అభిరూపత్వము, మార్దవము, సౌకుమార్యము, ఇవి ఆలంబనగుణములు.
యౌవనం నిరూప్యతే
| సర్వాసామపి నారీణాం యౌవనం త్రివిధం మతం, | 77 |
సమస్తస్త్రీలకును యౌవనము మూఁడు తెఱగులౌను. ఆయాయౌవనమున చేష్టలు వెవ్వేరుగ నుండును.
ప్రథమయౌవనలక్షణం
| ఈషచ్చపలనేత్రాంతం స్మరస్మేరముఖాంబుజం, | 78 |
| లావణ్యోద్భేచరమ్యాంగం విలసద్భావసౌరభం, | 79 |
| ప్రథమం యౌవనం తత్ర వర్తమానా మృగేక్షణా, | 80 |
| సఖీకేళిరతా స్వాంగసంస్కారకలితాదరా, | 81 |
| నాతిలజ్జావతీ కాంతసంభోగే కింతు శఙ్కతే, | |
కించిచ్చపలములైన కడకండ్లనుగలదిగాను, మన్మథునిచే వికాసము నొందిన ముఖపంకజము గలదిగాను, గర్వమువలన గలిగిన రజోగంధముతోఁ గూడినదిగాను, నిండుఎఱుపు లేనిపెదవులు గలదిగాను, లావణ్యముయొక్క