చతుర్విధశృంగారనాయకలక్షణం
| ఏతే శృంగారవిషయాశ్చత్వారస్స్యుః పృథక్పృథక్, | 68 |
శృంగారవిషయులైన ఈనాయకులు అనుకూలుఁడు, దక్షిణుఁడు, ధృష్టుఁడు, శకుఁడు అని వెవ్వేఱుగ నలుతెఱఁగు లగుదురు.
అనుకూలనాయకలక్షణం
| ఏకాయత్తో౽నుకూలస్స్యాత్సదా తామనురంజయన్, | 69 |
ఇతరస్త్రీలను జూచుట మొదలయిన వ్యాపారరహితుఁడును, స్వస్త్రీయందే ప్రేమగలవాఁడునై యుండువాఁడు అనుకూలుఁ డనఁబరగును.
దక్షిణనాయకలక్షణం
| బహ్వీషు విద్యమానాసు స్వాశ్రితాసు నిరంతరం, | 70 |
తన్నాశ్రయించిన అనేకస్త్రీలయందు సమముగ ప్రీతిఁజేయువాఁడు దక్షిణుఁ డనఁబరగును.
ధృష్టనాయకలక్షణం
| వ్యక్తాగా రతభీర్ధృష్టః వారితో౽పి న ముంచతి, | 71 |
ఎవ్వడు తనయపరాధము నాయికచే నెఱుఁగఁబడినను భయములేక యుండునో తొలఁగించినం దొలఁగఁడో ఆనాయికనే త్వరగా నమస్కారము మొదలయిన ఉపాయములచే అనుసరించునో వాడు ధృష్టుఁ డనఁబరగును.