పుట:భరతరసప్రకరణము.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములు సంతాపము, దేహము వణకు, చిన్నబోవుట, వ్యాపారాంతరములయందు ప్రీతిలేకయుండుట, కన్నీరు విడుచుట, తనయవస్థను సఖులకుఁ దెలుపుట మొదలైనవి.

విప్రలబ్ధానాయికాలక్షణం

క్వచిత్సంకేతమావేద్య తత్ర నాథేన వంచితా,
స్మరార్తా విప్రలబ్ధేతి కథితా భావకోవిదైః.

46


అస్యాస్తు చేష్టా నిర్వేదశ్చింతా ఖేదో౽థ దీనతా,
అశ్రునిశ్వాసమూర్ఛాద్యాః కథితా భావవేదిభిః.

47

ఒకానొకచోటిని సంకేతస్థానముగాఁ జెప్పి అక్కడ నాయకునిచే వంచింపఁబడి అనఁగా అతఁ డక్కడికి రాకపోఁగా మన్మథపీడితురాలై యుండునది విప్రలబ్ధ యనఁబడును. దీనివ్యాపారములు నిర్వేదము, చింత, ఖేదము, దీనత, కన్నీరును విడుచుట, నిట్టూర్పులు విడుచుట, మూర్ఛఁ జెందుట మొదలైనవి.

ఖండితానాయికాలక్షణం

ఉల్లంఘ్య సమయం యస్యాః ప్రేయానన్యోపభోగవాన్,
భోగలక్ష్మాంకితః ప్రాతరాగచ్ఛేత్సా హి ఖండితా.

48


అస్యాస్తు చేష్టా నిశ్వాసస్తూష్ణీం భావో౽శ్రుమోచనం,
ఖేదభ్రాంత్యస్ఫుటాలాపా ఇత్యాద్యా విక్రియా మతాః.

49

సంకేతసమయము నతిక్రమించి అన్యోపభోగపుగుఱతులతో ప్రాతఃకాలమందు వచ్చెడినాయకుని గలది ఖండితానాయిక యనఁబడును. దీనివ్యాపారములు నిట్టూర్పు విడుచుట, పలుకకుండుట, కన్నీరు విడుచుట, ఖేదపడుట, భ్రమించుట, మూలుగుట మొదలయినవి.