స్వాధీనపతికానాయికాలక్షణం
| ప్రియోపలాలితా నిత్యం స్వాధీనపతికా మతా, | 40 |
| వనకేళీజలక్రీడాకుసుమాపచయాదయః, | |
నాయకునిచే నెల్లప్పుడు సంతోషపఱుపఁబడెడిది స్వాధీనపతిక. దీనివ్యాపారము మన్మథపూజామహోత్సవము మొదలయినవియు, వనవిహారము, జలక్రీడ, పుప్పాపచయము, మొదలయినవియును.
వాసకసజ్జికానాయిలక్షణం
| ప్రియాగమనవేళాయాం మండయంతీ ముహుర్ముహుః. | 41 |
| కేళిగృహం తథాత్మానం సా స్యాద్వాసకసజ్జికా, | 42 |
| సఖీవినోదో నితరాం ముహుర్దూతీనిరీక్షణం, | 43 |
ప్రియుఁడు వచ్చెడిసమయమందు తా నలంకరించుకొని కేళీగృహము నలంకరించి సిద్ధముగా నుండునది వాసకసజ్జికానాయిక. దీనివ్యాపారములు నాయకుని సంసర్గమనోభీష్టమును యోచించుట, సఖులతోడి వినోదము సల్పుట ఆడుగడుగునకు దూతికను సాభిప్రాయముగఁ జూచుట, నాయకుఁడు వచ్చెడిదారిని జూచుట మొదలైనవి.
విరహోత్కంఠితానాయికాలక్షణం
| అనాగసి ప్రియతమే చిరయత్యుత్సుకా తుయా, | 44 |
| అస్యాస్తు చేష్టాస్సంతాపో వేపథుశ్చాంగసాదనం, | 45 |
నిరపరాధియగు ప్రియుఁడు రాక జాగుచేయఁగా కాలవిలంబము నోర్వక యెదురుచూచుచుండునాయిక విరహోత్కంఠిత యనఁబడును. దీనివ్యాపార .