పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

572

నమూల్యములగు గ్రంథములకుఁ గవిజీవితము కాలము నెఱుంగ వీలు కలుగకున్నది. కేవల యశఃకాములై గ్రంథరచన మొనరించినకవులయెడఁ గృతఘ్నులమై వారివృత్తములఁ దెలుపుపద్యముల విడచుట కవులకు భాషకుఁ గూడ నింత యనరానిద్రోహ మొనరించుట యని మాతలంపు.

రంగశాయిశతకము రచించినకవి యెవఁడో యేకాలముననుండెనో తెలిసికొననగు నాధారములు లేవు. ధారాసౌష్ఠవము భావవిస్తృతిఁ బట్టిచూడఁ గవి నూటయేబదిసంవత్సరముల కీవలివాఁడు గాఁడని తోచును. ఇందులకు ఈశతకపుఁ బ్రాచీనలిఖితప్రతులు సాక్ష్యముగాఁ గలవు. కవి పుణ్యనదులఁ బేర్కొనుచు మలాపహారిణిని బేర్కొనెను. ఇది గుడివాడతాలూకాలోని కాలువ గాన నాప్రాంతవాసి యని దేశోద్ధారకులు వ్రాసిరిగాని మలాపహారిణి "పాపనాశని” యని మాతలంపు. ఇది తిరుపతిలోని యొకజలపాతము. సుప్రసిద్ధము లగుపుణ్యనదుల నెన్నింటినో పేర్కొనుచు వ్యాప్తి లేని యొక చిన్నకాలువను బ్రశంసించెననుట పొసఁగదు. ఛంద