పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

రంగశాయిశతకము మిగులప్రౌఢముగ నిర్దుష్టముగ నున్నది. ఇందలిపద్యములు చాలచోటులఁ బ్రాతపఠనీయములుగ నున్నవి. ప్రతిపద్యమునందును నిరాఘాటమగుధారయు మనోహరమగు పదకల్పనము సరళమగుభావ ముంటచే నీశతకము ప్రశస్తతర మనుటలో సంశయము లేదు. ఉపలభ్యమగు నీశతకప్రతియందు 101 పద్యముమాత్ర ముంటవలనను సాధారణముగ 108 పద్యములతో శతకము లుంటవలనను కవివృత్తాంతము దెలుపుపద్యములు కానరాకపోవుటవలనను ఇంకను గొన్నిపద్యములు లభింపవలసియుండునని తలంచుచున్నాము. వ్రాతప్రతులున్నవారు మిగిలినపద్యములకై ప్రయత్నించిరేని శతకము సంపూర్ణము కాఁగలదు.

కవిజీవితము దెలుపుపద్యములను వ్రాసికొనక కథాంశములను వ్రాసికొను నాచారము లేఖకులందును ముద్రణకర్తలయందుఁ గలదు. అందుచే