పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

573

ప్రతిబంధకముచేఁ బాపనాశనిని మలాపహారిణి యని కవి వాకొని యుండును. మిక్కిలి వ్యాప్తిగల యీశతకము రచించిన కవిచరిత్రాదు లెఱుంగ నవకాశములు లేమి మిగుల సంతాపకరము. సుప్రసిద్ధగ్రంథములు కొన్ని కర్తృనామము లేకే వ్యాప్తిలో నున్నవి.

ఈశతకకర్త శ్రీవైష్ణవుఁడై యుండును. శ్రీభగవద్రామానుజుని నివాసస్థలమగుటవలనను వైష్ణపమతప్రచారమునకుఁ బ్రధానస్థాన మగుటవలన శ్రీరంగమునెడ రంగనాయకునియెడ వైష్ణవులకు భక్తిప్రపత్తులు మెండు. చోళులకాలమున శ్రీరంగము మిగుల సంపదలతోఁ దులతూఁగెను. రంగనాయకులు విప్రనారాయణ యనుతొండరడిపొడియాళ్వారు (భక్తాంఘ్రిరేణువు)నకు మోక్ష మొసంగిన కథాంశము శతకమునందలి 86 వ పద్యమునందుఁ గలదు. ఈశతకము ప్రతిపద్యమునందును భక్తిభావమును బ్రకటించుచున్నది. దీనిని బట్టి చూచినను శతకకర్త వైష్ణవుఁడని విశ్వసింపవచ్చును.

కవి యీశతకమును బ్రౌఢవయస్సులో వ్రాసి యుండును. కాననే యమకము అంత్యనియమము.