పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బూని మఱెన్నైనఁ జేయఁ బుట్టుక చెడునే
దానికి వైరి వివేకము
భానునుతా శివముకుంద పరమానందా.

77. క. చేయఁగవలసినపని విధి
సేయుటగా కనుచు నెంచి సేయుచుఁ జేసీ
జేయని యాపని యదియును
బాయరయా శివముకుంద పరమానందా.

78. క. సృష్టికిఁ గలిగినతను విది
నష్టం బని తొలఁగి తన్ను నయముగ నంత
ర్దృష్టిఁ గనలేని మనుజుఁడు
భ్రష్టుఁ డయా శివముకుంద పరమానందా.

79. క. ఊనము జడమును విత్తును
గానిది చైతన్య మెట్లు గానేర్చునయా
తానే దానికి మూలము
భానునుతా శివముకుంద పరమానందా.

80. క. తానెఱుఁగనిపని యైనన్‌
బూనఁగ మది కెట్టు లింపు పుట్టును జెపుమా
దానికి నేరం బే దిఁక
భానునుతా శివముకుంద పరమానందా.

81. క. అన్నియుఁ దానై యుండగ
నన్నియుఁ దాఁగాక తోఁచె నణఁగక వేఱా
యన్నియుఁ దనలో నైక్యము
పన్నుగ నిఁక శివముకుంద పరమానందా.

82. క. ఎఱిఁగెడి యెఱుకను గొని తా
నెఱుఁగుదుననువాఁడు జడుఁడు యెఱిఁగెడు నెఱుకన్‌
మఱచిన యెఱుకే తా నగుఁ
బరమాత్మా! శివముకుంద పరమానందా.

83. క. ఒండెఱుఁగక తనుగంటే
పండినకాన్పగుచు సర్వపరిపూర్ణం బై